Holy Bath: కొత్త జంటలు పుణ్య స్నానం ఆచరిస్తే.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

Holy Bath: హిందూ సంప్రదాయంలో నదిలో స్నానాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. నది స్నానం చేస్తే పాపాలు అన్ని కూడా తొలగిపోతాయని, మంచి జరుగుతుందని నమ్ముతారు. అయితే ఒకప్పుడు పెళ్లి అయిన తర్వాత కొత్త జంటలు పుణ్య స్నానాలు చేయడానికి వెళ్లేవారు. కానీ ప్రస్తుతం రోజుల్లో మాత్రం పబ్‌లకు వెళ్తున్నారు. అయితే పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని పండితులు అంటున్నారు. అలాగే సంతానం కూడా కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే నదిలో స్నానం చేయడం వల్ల భార్యాభర్తలకు మంచి ఏం జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
పాపాలు తొలగిపోతాయి
పవిత్ర నదుల్లో స్నానం చేస్తే మనం చేసిన పాపాలు తొలగిపోయి, శరీరం, మనసు శుభ్ర పడతాయని నమ్ముతారు. భార్యాభర్తలు కలిసి స్నానం చేస్తే వారిద్దరి పాపాలు పోవడంతో వారు పరిశుభ్రంగా మారతారని పండితులు చెబుతున్నారు.
పుణ్యం
పవిత్రమైన స్నానాలు చేయడం వల్ల పుణ్యం వస్తుందని పండితులు అంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ పని చేస్తే, వారికి రెట్టింపు పుణ్యం లభిస్తుందని, వారి దాంపత్య జీవితానికి మంచి జరుగుతుందని నమ్మకం.
బంధం బలపడటం
ఇద్దరూ కలిసి స్నానం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య దగ్గరితనం పెరుగుతుందని పండితులు అంటున్నారు. పవిత్రమైన నదిలో కలిసి స్నానం చేయడం ద్వారా వారిద్దరి బాండ్ కూడా పెరుగుతుంది. అలాగే ఒకరి పట్ల ఒకరికి అవగాహన, ప్రేమ పెరుగుతాయని, దాంపత్య జీవితం బాగుంటుందని పండితులు అంటున్నారు.
సంతానం
పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సంతానం కలుగుతుందని, కుటుంబంలో సుఖ సంతోషాలు, అన్నీ మంచి జరుగుతాయని పండితులు చెబుతున్నారు. పూర్వ కాలంలో పెళ్లి అయిన తర్వాత తప్పకుండా భార్యాభర్తలు పుణ్య స్నానాలు చేసేవారు.
మంచి జరుగుతుంది
ఏదైనా మంచి పని ప్రారంభించే ముందు లేదా జీవితంలో ఒక ముఖ్యమైన అడుగు వేసే ముందు నదిలో స్నానం చేస్తే ఆ పనికి దేవుడి ఆశీస్సులు లభిస్తాయని, అది విజయవంతంగా పూర్తి అవుతుందని నమ్ముతారు.
మనశ్శాంతి
నది ప్రవాహంలో స్నానం చేస్తే శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని కూడా కొందరు భావిస్తారు. స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయడం, ప్రకృతి దగ్గర ఉండటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Viral Video : వీడికి ఎన్ని గుండెలు.. 15అడుగుల కొండచిలువతో చిన్నారి ఆట
-
Life Lessons: లైఫ్ ఎండ్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారా.. ఈ స్టోరీ వినండి మీకోసమే!
-
Puja: అబ్బాయిలు పూజలు చేస్తే ఏమవుతుందో తెలిస్తే.. డైలీ ఇంట్లో మీరే ఇక పంతులు
-
Tholi Ekadasi: ఏ సమయంలో తొలి ఏకాదశి నాడు పూజిస్తే మంచిదో మీకు తెలుసా?
-
Tholi Ekadasi: పాపాల నుంచి విముక్తి పొందాలా.. తొలి ఏకాదశి నాడు ఇలా చేస్తే చాలు
-
Business Vastu Tips: ఏ వ్యాపారం ప్రారంభించినా నష్టపోతున్నారా.. ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఇక లాభమే!
-
Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం