Lord shiva: సోమవారం ఈ మంత్రం జపిస్తే కష్టాలన్నీ మాయం

Lord shiva: చాలామంది భక్తులు శివయ్యను నమ్ముతుంటారు. ఎంతో భక్తితో శివయ్యను పూజిస్తారు. కానీ ఎలా పూజిస్తే ఫలితం వస్తుందో అనే విషయం సరిగ్గా తెలియదు. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది కష్టాలతో ఉంటున్నాడు. జీవితంలో వారికి కావాల్సినవి ఎన్ని కూడా ఏదో ఒక లోపం ఏర్పడుతుంది. డబ్బు ఉన్నా కూడా కొందరు ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. కోరిన ఉద్యోగం రాలేదని, లేకపోతే పెళ్లి జరగలేదని, అనుకున్న పనులు కాలేదని ఇలా ఏదో ఒక కారణంతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇలాంటి వారు చాలా మంది ఆ పరమ శివుడిని పూజిస్తారు. భక్తితో ఆ శివుడిని పూజిస్తే అన్ని సమస్యలను కూడా తీర్చి కుటుంబంలో సంతోషాన్ని తీసుకొస్తాడు. అయితే శివుడిని పూజించే పద్ధతిలో పూజిస్తేనే సరైన ఫలితం ఉంటుందని, అనుకున్న కోరికలు అన్ని కూడా తీరుతాయని పండితులు అంటున్నారు. చాలా మంది రోజూ శివాలయానికి వెళ్తుంటారు. సమయం ఉన్నవారు రోజూ శివాలయానికి వెళ్తుంటారు. అదే సమయం లేని వాళ్లు సోమవారం, శనివారం లేదా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు వెళ్తుంటారు. మిగతా రోజులు వెళ్లినా వెళ్లకపోయినా కూడా తప్పకుండా సోమవారం, శనివారం అయితే వెళ్తారు. అయితే సోమవారం అనేది ఇంకా శివుడికి ప్రత్యేకమైన రోజు. ఈ సోమవారం రోజు వెళ్లి దేవుడిని దర్శించుకుంటే కోరిన కోరికలు అన్ని కూడా తీరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి ఎలా పూజిస్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయో ఈ స్టోరీలో చూద్దాం.
సోమవారం రోజు శివాలయానికి వెళ్లి ఓం నమ:శివాయ అని స్మరించాలి. ధ్వజ స్తంభం దగ్గర నిల్చోని పైకి చూస్తూ ఓం నమ:శివాయ అని స్మరించాలి. ఆ తర్వాత నంది దగ్గరకు వెళ్లి ఓ నంది దేవుడా శివుడిని దర్శించడానికి కాస్త దారి చూపించు. శివుడిని దర్శిస్తాను. నాకున్న సమస్యలు అన్నింటిని కూడా తీర్చేయ్ దేవుడా? అని ఓం నమ:శివాయ అని స్మరించాలి. ఇలా శివుడిని దర్శిస్తే మాత్రం తప్పకుండా మీ సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఎలాంటి సమస్యలు ఉన్నా తీరి సంతోషంగా ఉంటారు. ఎవరైతే ఎక్కువగా రుణబాధలతో ఇబ్బంది పడుతుంటారో వారు తప్పకుండా ఇలా శివాలయానికి వెళ్లి ఇలా పూజలు చేయాలి. ఇలా చేస్తే మీకు పెళ్లి కాకపోయినా కూడా పెళ్లి అవుతుంది. కోరిన ఉద్యోగం వస్తుంది. అనుకున్న పనులు అన్ని కూడా అవుతాయని పండితులు చెబుతున్నారు. అయితే శివాలయానికి ఉదయం లేదా సాయంత్రం ప్రదోష సమయంలో వెళ్తేనే మంచిదని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఈ సమయంలో శివాలయానికి వెళ్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి. ఎలాంటి సమస్యలు ఉన్నా తీరుతాయి. గుడిలో ఒక పది నిమిషాలు అయినా కూడా కూర్చోని ఓం నమ:శివాయ అని స్మరిస్తుండాలి. ఇలా చేస్తేనే మీరు కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి. లేకపోతే నెరవేరడం కష్టమే.
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఎలా పూజిస్తే.. సమస్యలు తొలగిపోతాయంటే?
-
Exams complete: విద్యార్థులకు పరీక్షలు ముగిశాయా.. ఓ కన్నేసి ఉంచండి
-
Rashmika Mandanna: రష్మిక ఆస్తులు తెలిస్తే.. షాక్ కావాల్సిందే
-
Concentration: ఏకాగ్రత ఉన్నవారిలో కనిపించే లక్షణాలివే
-
Motorola: రూ.6999 కే 50MP కెమెరా ప్రీమియం లుక్ ఫోన్..!
-
Indian Post: GDS రిజల్ట్స్ వచ్చేసాయ్.. ఇలా చెక్ చేసుకోండి!