Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఎలా పూజిస్తే.. సమస్యలు తొలగిపోతాయంటే?
Sri rama navami : పట్టణాల్లో కంటే గ్రామాల్లో శ్రీరామ నవమిని ఎంతో బాగా జరుపుకుంటారు. రాముడికి కళ్యాణం చేసి అన్ని కూడా సమర్పిస్తారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కొందరు వస్త్రాలు, విసనకర్ర వంటివి దానం చేస్తారు. ఇలా చేస్తే రాముడు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. అంతా కూడా మంచి జరగాలంటే శ్రీరామ నవమి రోజు తప్పకుండా ఈ నియమాలు పాటించి పూజ చేయండి. దీనివల్ల మీకు అంతా మంచే జరుగుతుంది.

Sri rama navami: చైత్రమాసంలో తొమ్మిదవ రోజున శ్రీరాముడు పుట్టాడని పురాణాలు చెబుతుంటాయి. రాముడు పుట్టిన రోజున ప్రతీ ఏడాది శ్రీరామ నవమి ఉత్సవాలను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమిని జరుపుకుంటారు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకము జరిగాయని చెబుతుంటారు. శ్రీరామ నవమి పూజను ఎంతో భక్తితో పూజిస్తే తప్పకుండా ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. అయితే శ్రీరామ నవమి రోజు తప్పకుండా కొన్ని నియమాలు పాటించి పూజలు చేస్తేనే మంచిది. అయితే ఎలా పూజిస్తే సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయో ఈ స్టోరీలో చూద్దాం.
శ్రీరామ నవమి రోజు ఆలస్యంగా కాకుండా బ్రహ్మముహుర్తంలోనే నిద్ర లేవాలి. ఆ తర్వాత అభ్యంగన స్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు వేయాలి. ఇలా చేశాక ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి.. కొత్త దుస్తులు ధరించాలి. ఇలా చేసిన తర్వాత ఇంట్లో పూజలు చేయాలి. ఇంట్లో ఉన్న శ్రీరాముడి చిత్ర పటానికి పువ్వులతో అలకరించాలి. లేదా కొత్త విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి ప్రతిష్టించుకోవచ్చు. ఇంట్లో శ్రీరాముడిని పూజిస్తే సంతోషం కలుగుతుంది. ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు లేకుండా ఉంటారు. ముఖ్యంగా జాతకంలోని గ్రహదోషాలు అన్ని కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అయితే శ్రీరామ నవమి రోజు రాముడికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి. వాటి మీద శ్రీరాముని విగ్రహాలు పెట్టి పూజలు చేయాలి. దేవుడికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. అలాగే పూల దండలు సమర్పించి.. కల్యాణం చేయాలి. శ్రీరాముడికి నైవేద్యంగా వడపప్పు, పానకం వంటివి సమర్పించాలి. వీటితో పాటు పండ్లు, విసనకర్ర, తాంబూలం, నూతన వస్త్రాలు ఇవ్వాలి. ఇవన్నీ చేసిన తర్వాత రామాయణం లేదా హనుమాన్ చాలీషా, రామచరిత్ర మానస్ వంటివి చదవాలి. వీటిని భక్తితో చదవడం వల్ల అంతా కూడా మంచే జరుగుతుంది. జాతకంలోని గ్రహ దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు పోతాయి. బాధలు, కష్టాలు అన్ని కూడా తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని పండితులు అంటున్నారు. అయితే మీకు సమీపంలో శ్రీరాముడు ఆలయం ఉంటే వెళ్లండి. అక్కడ కళ్యాణం చేస్తే చూడండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
పట్టణాల్లో కంటే గ్రామాల్లో శ్రీరామ నవమిని ఎంతో బాగా జరుపుకుంటారు. రాముడికి కళ్యాణం చేసి అన్ని కూడా సమర్పిస్తారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కొందరు వస్త్రాలు, విసనకర్ర వంటివి దానం చేస్తారు. ఇలా చేస్తే రాముడు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. అంతా కూడా మంచి జరగాలంటే శ్రీరామ నవమి రోజు తప్పకుండా ఈ నియమాలు పాటించి పూజ చేయండి. దీనివల్ల మీకు అంతా మంచే జరుగుతుంది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Sri Rama Navami 2025: నవమి నైవేద్యాలతో ఆరోగ్యం మీ సొంతం
-
Sri Rama Navami: నవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే.. అదృష్టమే
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఈ పనులు చేస్తే అదృష్టమే
-
Ugadi: కొత్త ఏడాదికి వేటిని దానం చేస్తే మంచిదంటే?
-
Ugadi : ఉగాది తర్వాత ఈ రాశుల వారికి పట్టబోతున్న రాజయోగం
-
Vastu Tips: ఈ తేదీలో పుట్టిన వారు పర్సులో వీటిని పెట్టుకుంటే అదృష్టమే