Vastu Tips: ఈ తేదీలో పుట్టిన వారు పర్సులో వీటిని పెట్టుకుంటే అదృష్టమే

Vastu Tips: డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది. కొందరు బయటకు చెప్పుకుంటే.. మరికొందరు బయటకు చెప్పుకోరు. అయితే కొందరు ఎంత సంపాదించినా కూడా డబ్బు నిల్వ ఉండదు. వాటర్ లెక్క ఖర్చు అవుతుంది. అలాగే వారికి అదృష్టం కూడా ఉండదు. దీంతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఒక్కోక్కరు పుట్టిన తేదీ బట్టి వారు కొన్ని నియమాలు పాటిస్తే వారికి డబ్బుతో పాటు అదృష్టం కూడా వరిస్తుందని పండితులు అంటున్నారు. అయితే వారి పుట్టిన తేదీలోని సంఖ్యలు అన్నింటిని కలిపి మూల సంఖ్య అని అంటారు. ఏయే మూల సంఖ్య ఉన్నవారు పర్సులో వేటిని పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందో తెలుసుకుందాం.
మూల సంఖ్య 1
మూల సంఖ్య 1 ఉన్నవారు పర్సులో రాణి నాణేన్ని పెట్టుకుంటే అంతా కూడా మంచే జరుగుతుంది. ఈ నాణెం పర్సులో ఉండటం వల్ల విజయం, గౌరవం, శ్రేయస్సు అన్ని కూడా లభిస్తాయి. ఎలాంటి ఆర్థిక సమస్యలు, దురదృష్టం ఉన్నా కూడా తీరిపోతుంది. అన్ని విధాలుగా కూడా కలసి వస్తుంది.
మూల సంఖ్య 2
ఈ సంఖ్య ఉన్నవారు పర్సులో వెండి నాణాన్ని పెట్టుకోవచ్చు. అయితే వీరు గుండ్రంగా ఉండే నాణేం కాకుండా చతురస్రాకారంగా ఉండే నాణేం పెట్టడం వల్ల మంచి జరుగుతుంది. ఈ నాణెం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారో వారు ఈ నాణెంను పర్సులో పెట్టుకోవడం మంచిది.
మూల సంఖ్య 3
ఈ సంఖ్య వారు పర్సులో కుంకుమ పువ్వును పెట్టుకోవడం వల్ల మీరు అన్ని విషయాల్లో సక్సెస్ సాధిస్తారు. ఏదైనా ఉద్యోగం సాధించడంలో అయితే తప్పకుండా విజయం సాధిస్తారు. అయితే దీన్ని పసుపు పేపర్లో పెట్టి పర్సులో పెట్టుకోవాలి.
మూల సంఖ్య 4
ఈ సంఖ్య ఉన్నవారు పర్సులో బార్లీ గింజలను పెట్టుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని డైరెక్ట్‌గా పెట్టకుండా ఒక ఆకుపచ్చని క్లాత్‌లో పెట్టి పర్సులో పెట్టుకోవాలి. ఇలా చేస్త తప్పకుండా రాహు దోషం తగ్గుతుందని పండితులు అంటున్నారు.
మూల సంఖ్య 5
తులసి ఆకును మూల సంఖ్య 5 ఉన్నవారు పెట్టుకుంటే తెలివితేటలు పెరుగుతాయి. ఎలాంటి సమస్యలు రాకుండా హాయిగా ఉంటారు. ఎంత కోపం ఉన్నా కూడా తగ్గిపోతుంది. చీటికి మాటికి కోపానికి గురవుతున్న వారికి బాగా ఉపయోగపడుతుంది.
మూల సంఖ్య 6
ఈ మూల సంఖ్య ఉన్నవారు ఎండిన గులాబీలను పర్సులో పెట్టుకోవాలి. దీన్ని పెట్టుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయి. ఇక జీవితంలో కష్టాలు ఉండవు. వీటివల్ల మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు.
మూల సంఖ్య 7
వీరు ఇష్టమైన దేవుడు ఫొటోను పర్సులో పెట్టుకుంటే మంచిది. వీటితో పాటు భర్త, పిల్లలు ఇలా ఎవరు నచ్చినా కూడా వారి ఫొటో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టుకోవడం వల్ల మీకు రాహు, కేతువు శక్తి లభిస్తుంది. ఏ పని మొదలు పెట్టినా కూడా అంతా మంచే జరుగుతుంది.
మూల సంఖ్య 8
ఈ సంఖ్య ఉన్నవారు ఏదో ఒక నాణెం పర్సులో పెట్టుకోవచ్చు. అయితే ఈ నాణెం దేవునిది అయితే మంచిది. ఈ నాణెం వల్ల ఆర్థిక సమస్యలు ఉండవు. అంతా కూడా మంచే జరుగుతుందట.
మూల సంఖ్య 9
ఈ సంఖ్య ఉన్న వారు ఎరుపు దారాన్ని పర్సులో పెట్టుకుంటే మంచిది. దీనివల్ల కోరుకున్న కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి. అయితే ఎర్రటి దారానికి 9 ముడులు వేసి పర్సులో పెట్టుకోవాలి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Vastu Tips: ఈ వస్తువులను ఫ్రిడ్జ్‌పై పెట్టారో.. మీకు సమస్యలు తప్పవు
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఎలా పూజిస్తే.. సమస్యలు తొలగిపోతాయంటే?
-
Ugadi: కొత్త ఏడాదికి వేటిని దానం చేస్తే మంచిదంటే?
-
Ugadi : ఉగాది తర్వాత ఈ రాశుల వారికి పట్టబోతున్న రాజయోగం
-
Vastu Tips: కిచెన్ స్లాబ్‌పై చపాతీ చేస్తున్నారా.. ఇది మీ కోసమే
-
Vastu Tips: వారంలో ఏ రోజు బంగారం కొనడానికి మంచిదో మీకు తెలుసా?