Champions Trophy 2025: గిల్ సెంచరీ.. కానీ హార్డిక్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణమేంటంటే?

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా శుభారంభం చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ 101 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 2 సిక్సర్లు, 9 ఫోర్లుతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో గిల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వరించింది. అయితే ఈ మ్యాచ్‌లో గిల్ సెంచరీ చేసినా కూడా ఇందులో కేఎల్ రాహుల్ పాత్ర చాలా ఎక్కువ ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో అంటున్నారు. గిల్ సెంచరీ చేయడానికి రాహుల్ తన అర్థ సెంచరీని త్యాగం చేశాడని అంటున్నారు. ఒకవేళ కేఎల్ రాహుల్ ఔట్ అయి ఉంటే హార్దిక్ పాండ్యా వచ్చే వాడు. ఇతను తప్పకుండా ఆడేవాడని, గిల్‌కి సెంచరీ చేసే ఛాన్స్ ఇచ్చేవాడు కాదని కామెంట్లు చేస్తున్నారు. హార్డిక్ పాండ్యా వచ్చి ఉంటే.. గిల్ సెంచరీ విషయం పూర్తిగా మరిచిపోవాల్సిందేనని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అలాగే 2023 ప్రపంచ కప్‌లో కూడా రాహుల్ విరాట్ కోహ్లీ సెంచరీకి సహకరించాడని అన్నారు. అప్పుడు, ఇప్పుడు రాహుల్ తన అర్థ సెంచరీ గురించి పట్టించుకోకుండా సాయం చేశాడని అంటున్నారు.
ఇదిలా ఉండగా బంగ్లాదేశ్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. బంగ్లాదేశ్ 228 పరుగులకే అలౌట్ కాగా.. భారత్ 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (41), శుభ్‌మన్ గిల్ నాటౌట్‌గా (101) స్కోర్ చేశారు. రోహిత్ (Rohith Sharma) ఫామ్‌లో లేడని అన్న వాళ్లందరూ షాక్ అయ్యేలా ఫామ్‌లోకి వచ్చాడు. 36 బంతుల్లోనే 41 పరుగులు చేయగా.. అందులో ఏడు ఫోర్లు కొట్టాడు. హిట్ మ్యాన్ పక్కాగా హాఫ్ సెంచరీ చేస్తాడనుకునేలోగా.. తస్కిన్ అహ్మద్ ఔట్ చేశాడు. లేకపోతే హిట్ మ్యాన్ ఖాతాలో మరో ఆఫ్ సెంచరీ చేరేది. రోహిత్ ఔట్ అయిన తర్వాత కోహ్లి (22), శుభ్‌మన్ (Subhman Gill) కలిసి ఆడారు. అయితే కోహ్లీ (Virat Kohli) చాలా జాగ్రత్తగా ఆడినా కూడా క్యాచ్ ఇచ్చేశాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) కూడా ఔట్ అయ్యారు. దీంతో టీమిండియా బ్యాటర్లు కాస్త జాగ్రత్తగానే ఆడారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్(41) వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో 46.3 ఓవర్లలోనే టీమిండియా లక్ష్య ఛేదనను సాధించింది.
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
Hardik Pandya : ఆ టీవీ నటితో హార్దిక్ పాండ్యా డేటింగ్!
-
Hardik pandya: హార్ధిక్ అవమాన భారం.. బయోపిక్ గా తీస్తే హిట్ పక్కా
-
Delhi Capitals : ఢిల్టీ జట్టుకు కెప్టెన్‌గా అక్షర్ పటేల్.. కేఎల్ రాహుల్‌ని కాదని ఈ యువ ప్లేయర్‌ని ఎందుకు?
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Gautam Gambhir: పంత్‌ని కాదని.. రాహుల్‌ను గంభీర్ సెలక్ట్ చేయడానికి ముఖ్య కారణం అదేనా!