Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో కివీస్‌కు బిగ్ షాక్.. గాయంతో హెన్రీ దూరం?

Champions Trophy:
ఫిబ్రవరి 19న ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) చివరి దశకు చేరుకుంది. దుబాయ్ వేదికగా మార్చి 9వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ (Champions Trophy Final) జరగనుంది. మొదటి సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడగా ఇందులో టీమిండియా (India) ఘన విజయం సాధించి ఫైనల్‌కి చేరింది. లాహోర్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఇందులో కివీస్ జట్టు గెలిచి ఫైనల్‌కి చేరింది. ఈ రెండు జట్లు దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్‌లో తలపడనున్నాయి. అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ మాట్ హెన్రీకి (Matt Henri) ఈ మ్యాచ్‌లో గాయం తగిలింది. రెండో సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ బౌలింగ్ సమయంలో క్లాసెన్ ఇచ్చిన క్యాచ్‌ను పట్టుకునే సమయంలో హెన్రీ భుజానికి గాయం తగిలింది. వెంటనే భుజం నొప్పితో మైదానం నుంచి వెళ్లిపోయాడు.
I am not a doctor but Matt Henry's injury looks serious. He should take complete bed rest until Sunday afternoon 2 pm local time. pic.twitter.com/oZr5lBwIex
— Sagar (@sagarcasm) March 5, 2025
నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కాస్త విశ్రాంతి తీసుకుని మళ్లీ రెండు ఓవర్ల తర్వాత మైదానంలోకి వచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ సమస్య తీవ్రమైంది. హెన్రీకి భుజం నొప్పి ఎక్కువ అయ్యింది. దీంతో ఫైనల్‌లో హెన్రీ ఉండకపోవచ్చనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే మార్చి 9వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సమయానికి అతని గాయం తగ్గకపోవచ్చని అంటున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో తీవ్రమైన నొప్పి తగ్గే అవకాశాలు చాలా తక్కువ. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హెన్రీ రెండు కీలక వికెట్లు తీశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో తన అవసరం తప్పకుండా ఉందని కివీస్ భావిస్తుంది. గాయం కారణంగా హెన్రీ టోర్నీ నుంచి ఔట్ అయితే మాత్రం తప్పకుండా కివీస్‌కి ఫైనల్‌లో బిగ్ షాకే.
హెన్రీ కనుక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో లేకపోతే టీమిండియాకి ప్లస్. ఎందుకంటే గత ఆదివారం దుబాయ్‌లో జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో హెన్రీ కీలక వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం ఐదు వికెట్లు హెన్రీ తీశాడు. శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్‌లో హెనీ రికార్డు కూడా సృష్టించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో టీమిండియాపై ఐదు వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఏ ఒక్క బౌలర్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాపై ఐదు వికెట్లు తీయలేదు. గతంలో ఈ టోర్నమెంట్‌లో భారత్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్ పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ నవేద్-ఉల్-హసన్ నాలుగు వికెట్లు తీశాడు. 2004లో మెన్ ఇన్ బ్లూతో జరిగిన మ్యాచ్‌లో తీశాడు. ఇప్పుడు అతనని వెనక్కి నెట్టి హెన్రీ ఫస్ట్ ప్లేస్‌కి వెళ్లాడు. నవేద్-ఉల్-హక్, షోయబ్ అక్తర్, డగ్లస్ హోండో, మహ్మద్ అమీర్ వరుస స్థానాల్లో ఉన్నారు.
-
BCCI: టీమిండియా ఆటగాళ్లు నక్క తోక తొక్కారు పో
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్‌పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!