Champions Trophy: స్టేడియంలో ఆస్ట్రేలియాకి బదులు భారత జాతీయ గీతం.. నెట్టింట వీడియో వైరల్

Champions Trophy:
ప్రస్తుతం పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) జరుగుతోంది. అయితే ఫిబ్రవరి 22వ తేదీన లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ (AUS vs ENG) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ప్లే చేస్తారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ జరగనుండగా.. ఆ దేశ జాతీయ గీతానికి బదులుగా పొరపాటున భారత జాతీయ గీతాన్ని స్టేడియంలో (National Anthem) కొన్ని సెకన్ల పాటు ప్లే చేశారు. ఒక్కసారిగా భారత్ జాతీయ గీతం జనగణమన రావడంతో ఆసీస్ ప్లేయర్లతో పాటు స్టేడియంలో ఉన్న అభిమానులు అందరూ కూడా షాక్‌కి గురయ్యారు. దీంతో వెంటనే స్టేడియం నిర్వాహకులు అప్రమత్తమై ఒక్కసారిగా ఆపేసి.. ఆస్ట్రేలియా జాతీయ గీతాన్ని ప్లే చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అనుకోని కారణాల వల్ల ఇలా జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్య మిస్తోన్న విషయం తెలిసిందే. అయితే భారత్‌తో జరిగే మ్యాచ్‌లు అన్ని కూడా హైబ్రిడ్ మోడ్‌లో దుబాయ్‌లో జరుగుతున్నాయి. ఇప్పటికే టీమిండియా బంగ్లాదేశ్‌తో మొదటి మ్యాచ్ ఆడింది. ఇందులో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్‌తో భారత్ నేడు తలపడనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ జరగనుంది.
India National Anthem played in Pakistan … 🇮🇳🇮🇳 #INDvsPAK #AusvsEng #EngVsAus pic.twitter.com/ruoP4rDx0n
— Bunty Singh (@Bunty_Singh__) February 22, 2025
ఇదిలా ఉండగా అందరూ కూడా పాకిస్థాన్, భారత్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. నేడు జరగనున్న ఈ మ్యాచ్‌పై అందరూ కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారత్, పాక్ ఒక్కో మ్యాచ్ వేర్వేరు జట్లుతో ఆడగ్గా.. పాకిస్థాన్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. భారత్ మాత్రం బంగ్లాదేశ్‌పై గెలిచింది. అయితే నేటి మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోతే ఇక ఇంటికే. సెమీ ఫైనల్‌కి చేరే అవకాశం లేదు. గ్రూప్ దశలో ఒక్కో జట్టు మిగతా జట్లుతో తలపడనుంది. వీటిలో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్టు సెమీస్‌కు వెళ్తుంది. అయితే గ్రూప్ ఎ, గ్రూప్ బి జట్లు ఆడుతాయి. రెండింటిలో విజయం సాధించిన జట్టు సెమీస్‌కు వెళ్తాయి. అయితే ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మొత్తం ఐదు సార్లు తలపడ్డాయి. ఇందులో పాక్ మూడు సార్లు గెలవగా.. భారత్ రెండు సార్లు గెలిచింది. అయితే నేడు పాక్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతుందని ఐఐటీ బాబా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్లేయర్లు అందరూ కూడా ఎంత కష్టపడినా కూడా మ్యాచ్ గెలవరని జ్యోతిష్యం చెప్పారు. మరి ఈ మ్యాచ్‌లో భారత్ లేదా పాకిస్థాన్ ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Jadeja: ఫైనల్స్‌కి ముందు టీమిండియాకి బిగ్ షాక్.. చిక్కులో జడేజా!
-
Steve Smith: రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్.. టీమిండియాతో ఓటమే కారణమా?
-
Viral Video: టీమిండియా ఘన విజయం.. విరాట్, అనుష్క క్యూట్ వీడియో వైరల్
-
Champions Trophy: టీమిండియాతో కంగారు మ్యాచ్.. టెన్షన్ మనకు కాదు.. ఆస్ట్రేలియాకే.. కారణమేంటి?