Champions Trophy: భారత్‌ను మట్టికరిపించాలని పాక్ కీలక నిర్ణయం.. నేడు జరగబోయే మ్యాచ్‌కి స్పెషల్ కోచ్

Champions Trophy:
నేడు భారత్, పాకిస్థాన్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) మొదటి మ్యాచ్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఈ మ్యాచ్ కోసం ఎదరు చూస్తున్నారు. పాకిస్థాన్, భారత్ మ్యాచ్ అంటే అందరూ కూడా అన్ని పనులు మానుకుని టీవీ ముందు కూర్చుకొంటారు. నిజానికి అన్ని మ్యాచ్‌ల కంటే ఈ మ్యాచ్ ఒక హైఓల్టేజ్ మ్యాచ్. భారత్ మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా (Teamindia) గెలిచి.. ఆ జోరులో ఉంది. పాకిస్థాన్ న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఎలాగైన ఈ మ్యాచ్ గెలవాలనే కసితో ఉంది. ఎందుకంటే నేడు జరిగే మ్యాచ్‌లో పాక్ ఓడిపోతే మాత్రం సెమీస్‌కు వెళ్లే ఛాన్స్ లేదు. అయితే టీమిండియా (Teamindia) కూడా పాకిస్థాన్‌ను (Pakistan) ఓడించాలనే పట్టుదలతోనే ఉంది. 2017 ఫైనల్‌లో జరిగిన మ్యాచ్ ఓటమికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్‌ను (Pakistan) మట్టికరిపించాలని టీమిండియా చూస్తోంది. రెండు జట్లు కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. అయితే నేడు భారత్, తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో పాక్ గెలిస్తేనే సెమీస్‌కు వెళ్తుంది. ఈ క్రమంలో ముందుగా టీమిండియాతో భారత్ పక్కాగా మ్యాచ్ గెలవాలి. అప్పుడే సెమీస్ ఛాన్స్ ఉంటుంది. అయితే టీమిండియాతో (Team India) మ్యాచ్ కోసం పాక్ స్పెషల్ కోచ్‌ను నియమించుకుంది.
ప్రస్తుతం పాకిస్థాన్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా సెలక్టర్ అకిబ్ జావేద్ ఉన్నాడు. అయితే టీమ్ ఇండియాతో మ్యాచ్ కోసం పాక్ జట్టును ఇంకా బలంగా సిద్ధం చేసేందుకు అకిబ్ మాజీ సహచరుడు ముదస్సర్ నాజర్ (Mudassar Nazar) సహాయం తీసుకుంటున్నాడట. ఎందుకంటే పాక్, భారత్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ స్టేడియంలోని అన్ని పరిస్థితుల గురించి ముదస్సర్‌కి బాగా అవగాహన ఉంది. ఎందుకంటే ఇతను కొన్నేళ్ల నుంచి దుబాయ్‌లోనే ఉంటున్నాడు. ఐసీసీ గ్లోబల్ అకాడమీలో ముదస్సర్ పనిచేస్తున్నాడు. అయితే అకిబ్ జావేద్ అతన్ని కోరగా.. రెండు రోజుల కిందటే.. పాకిస్థాన్ జట్టును కోరినట్లు తెలుస్తోంది. నెట్ సెషన్స్‌లో కూడా పాల్గొని ఆటగాళ్లు అందరికీ సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నాజర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. ఇతను ఎన్నో సార్లు పాక్ జట్టుగా కోచ్‌గా పనిచేశాడు. ఆ తర్వాత కెన్యా, యూఏఈ వంటి టీమ్‌లకు కూడా నాజర్ కోచ్‌గా వ్యవహరించాడు. అయితే నాజర్ కుడిచేతి బ్యాటర్. ఇతను మొత్తం 76 టెస్టులు ఆడగా 4,114 పరుగులు చేశాడు. మొత్తం 122 వన్డేల్లో మ్యాచ్‌లలో 2,653 పరుగులు చేశాడు. ఈ కారణంగానే పాకిస్థాన్ స్పెషల్ కోచ్‌ను నియమించుకుంది.