Ajinkya Rahane: మొదటి రౌండ్లో అన్ సోల్డ్.. ఫస్ట్ మ్యాచ్‌లో అదరగొట్టిన రహానే

Ajinkya Rahane: ఐపీఎల్ 18వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఆర్సీబీ ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రహానే అందరి దృష్టిని ఆకర్షించాడు. కోల్‌కతా జట్టు ఓడిపోయినా కూడా రహానేను మాత్రం పొగుడుతున్నారు. ఎందుకంటే ఐపీఎల్ మెగా వేలంలో రహానేను ఏ ఫాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. మొదటి రౌండ్లో కాకుండా రెండో రౌండ్లో చాలా తక్కువ ధరకు కేవలం రూ.1.5 కోట్లకు మాత్రమే కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత కెప్టెన్‌గా కూడా చేసింది.
తన మీద నమ్మకంతో జట్టుకి కెప్టెన్ చేసినందుకు రహానే నిలబెట్టుకున్నాడు. వేలంలో తక్కువగా కొనుగోలు చేశారనే కసి, కోల్‌కతా జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే కసి ఈ రోజు మ్యాచ్‌లో కనిపించాయి. ఫోర్లు, సిక్సర్లతో ఆర్సీబీకి చుక్కలు చూపించాడు. 56 పరుగులు చేసి మొదటి మ్యాచ్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్లో మొదటి అర్ధ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. కేకేఆర్ యాజమన్యం పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకున్నాడు.
ఇదిలా ఉండగా మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోయింది. ఈ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. సొంత గడ్డపై 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదటి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 174 పరుగులు చేసింది. అయితే బెంగళూరు జట్టు కేవలం 16.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (59*), ఫిల్ సాల్ట్ (56) ఆఫ్ సెంచరీలు చేశాడు. కెప్టెన్ రజత్ పటీదార్ (34) పరుగులు చేశాడు. కోల్‌కతా మొదటి నుంచి సాదాసీదాగా ఆడింది. మొదటి ఓవర్లోనే క్వింటన్ డికాక్ (4) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా మూడు ఓవర్లకు స్కోరు 9/1గానే ఉంది. ఆ తర్వాత బ్యాటర్లు కాస్త ఊపు అందుకున్నారు.
-
KKR vs RCB : బోణీ కొట్టిన ఆర్సీబీ.. ఇదే దూకుడుతో ఫైనల్ వరకు కొనసాగుతుందా?
-
IPL ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. KKR, RCB మ్యాచ్ రద్దు!
-
IPl 2025:క్రికెట్ ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్.. ఆ మ్యాచ్ రీ షెడ్యూల్?
-
Champions Trophy: భారత్‌ను మట్టికరిపించాలని పాక్ కీలక నిర్ణయం.. నేడు జరగబోయే మ్యాచ్‌కి స్పెషల్ కోచ్
-
IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ రిలీజ్.. 10 జట్లు ఎన్ని రోజులు జరగనుందంటే?