IPL 2025: ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆర్సీబీకి తప్పని భయం.. ఆందోళనలో ఫ్యాన్స్

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ మొదటి నుంచి అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈసారి అయినా ఆర్సీబీ టైటిల్ గెలవాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నిజం చెప్పాలంటే ఎన్నో ఏళ్ల కల కూడా. అయితే ఈ సీజన్‌లో ఆర్సీబీ జట్టు ప్లేయర్లు అద్భుతంగా ఆడారు. మొత్తం 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ రద్దు కావడంతో 17 పాయింట్లతో రెండో స్థానంలో పాయింట్ టేబుల్‌లో ఉంది. తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆర్సీబీకి మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో గెలిస్తే రెండో స్థానానికి వస్తుంది. అయితే మే 18వ తేదీ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఆర్సీబీ, గుజరాత్, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఫిక్స్ చేసుకున్నాయి. అయితే ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరిన మే 18 తేదీ ప్రస్తుతం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.
ఇది కూాడా చూడండి: Gmail : టైమ్ సేవింగ్ ట్రిక్స్.. Gmailలోని ఈ 4 అద్భుతమైన ఫీచర్లను తెలుసుకోండి
గతేడాది ఆర్సీబీ జట్టు మే18వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరింది. అయితే కోహ్లీ జెర్సీ నెంబర్ 18న క్వాలిఫై అయ్యిందని, ఈసారి ఆర్సీబీదీ టైటిల్ ఫిక్స్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. కానీ ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లోనే ఓడిపోయింది. అయితే ఈసారి కూడా అదే తేదీన ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరింది. దీంతో ఇప్పుడు కూడా అలానే అవుతుందా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్స్ చేరిన సంతోషం లేకుండా పోయిందని కామెంట్లు చేస్తున్నారు.
RCB qualified for playoffs this year but qualification last year on 18th May was something else pic.twitter.com/bjZvnztgI2
— Pari (@BluntIndianGal) May 18, 2025
ఇది కూాడా చూడండి: War 2 Movie: ‘వార్ 2’ నుంచి ఎన్టీఆర్ డైలాగ్‌లు లీక్.. థియేటర్లలో గూస్‌బంప్సే
ఈసారి అయినా జట్టు ఫైనల్‌కి పోయి టైటిల్ కొడుతుందా? లేదా? లేకపోతే గతేడాదిలాగానే జరుగుతుందా? అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. అయితే ఆర్సీబీ జట్టు హైదరాబాద్, లక్నోతో ఆడనున్న రెండు మ్యాచ్‌లలో గెలవాలి. లేకపోతే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. అయితే ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ రూల్ ప్రకారం టాప్-2లో ఉన్న జట్లు క్వాలిఫయర్-1 ఆడుతాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ ఆడుతాయి. ఇలా ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్-2 ఆడుతోంది. క్వాలిఫయర్-1లో ఏ జట్టు అయితే గెలుస్తోందో.. ఆ జట్టు క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టుతో ఫైనల్ ఆడుతుంది. ఈ క్రమంలోనే టాప్-2లో నిలిచేందుకు జట్లు ప్రాధాన్యత ఇస్తాయి. క్వాలిఫయర్-1లో ఓడినా.. క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది.
ఇది కూాడా చూడండి:Bigg Boss 9: నాగార్జున్ ఔట్.. బాలయ్య ఇన్.. హోస్టింగ్‌పై క్లారిటీ ఇదే!
-
IPL 2025: పంజాబ్ జట్టు సరికొత్త రికార్డు
-
IPL 2025: ఆ జట్టు ఈ మ్యాచ్ గెలిస్తే.. డైరెక్ట్ ప్లేఆఫ్స్
-
IPL 2025 : బీసీసీఐ నిర్ణయం పై మండిపడుతున్న అభిమానులు..కోల్‌కతా ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు!
-
IPL 2025: ప్లేఆఫ్ రేస్‌కు వెళ్లాలంటే.. ఏయే జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
-
Gautam Gambhir: విరాట్, రోహిత్ ఔట్.. ఇక గౌతమ్ గంభీర్ హవానే!
-
IPL new schedule: ఐపీఎల్ న్యూ షెడ్యూల్ రిలీజ్.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?