IPl 2025:క్రికెట్ ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్.. ఆ మ్యాచ్ రీ షెడ్యూల్?

Ipl:
ఐపీఎల్ 2025 సీజన్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చ్ 22 నుంచి జరగనున్న 18 వ సీజన్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆయా జట్లు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించి నిర్వహకులు ఐపీఎల్ షెడ్యూల్ ను ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులకు ఓ షాకింగ్ వార్త బయటకు వచ్చి కంగారు పెడుతోంది. ఏప్రిల్ 6వ తేదీన కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పుడు ఆ మ్యాచ్ పై కాస్త సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే అదే రోజు శ్రీరామనవమి ఉండటమే దానికి కారణంగా తెలుస్తోంది. దీనివల్ల భద్రతా కారణాల రీత్యా ఈ మ్యాచ్ ను రీ షెడ్యూల్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు జోరుగా సాగుతున్నాయి.
శ్రీరామ నవమ రోజున రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో సందడి సందడిగా ఊరేగింపులు జరిగే అవకాశం ఉంది. దీంతో అటు ఊరేగింపులకు ఇటు మ్యాచ్ కు భద్రత కల్పించడం కాస్త కష్టంతో కూడుకున్న పని. అందువల్లే ఆరోజు కోల్కతా వర్సెస్ లక్నో మ్యాచ్ రీ షెడ్యూల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయంపై క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు స్నేహశీస్ గంగూలి సిటీ పోలీస్ తో రెండుసార్లు చర్చించినట్లు తెలుస్తోంది. కానీ పోలీసుల నుంచి ఎలాంటి హామీ రాలేదని సమాచారం. ఈ మేరకు స్నేహసీస్ గంగూలి మాట్లాడుతూ.. విభాగల వారీగా వారికి ప్రాధాన్యత అంశాలు ఉన్నాయని.. అందువల్లనే పూర్తిస్థాయి భద్రతను కేటాయించలేమని పోలీసులు తెలిపినట్లు ఆయన చెప్పారు. ఒకవేళ ఏప్రిల్ 6 మ్యాచ్ రోజున పోలీసుల సెక్యూరిటీ లేకపోతే 65 వేల మందికి పైగా ప్రేక్షకులను కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుందని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇదే విషయంపై లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయంక మాట్లాడుతూ.. ఏపీలో 6న మ్యాచ్ నిర్వహణకు భద్రత విషయంలో బీసీసీఐదే ఆఖరి నిర్ణయం అన్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్ళమని చెప్పుకొచ్చారు. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో.
-
Sri Rama Navami 2025: నవమి నైవేద్యాలతో ఆరోగ్యం మీ సొంతం
-
Sri Rama Navami: నవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే.. అదృష్టమే
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఎలా పూజిస్తే.. సమస్యలు తొలగిపోతాయంటే?
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఈ పనులు చేస్తే అదృష్టమే
-
LSG vs SRH: సన్‌రైజర్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తట్టుకోగలదా?
-
Rashid Khan: బుమ్రా రికార్డ్ బ్రేక్ చేసిన రషీద్ ఖాన్