IND Vs BANG: నేడే టీమిండియా తొలి మ్యాచ్.. బంగ్లాతో సాగే పోరులో గెలిచేదెవరు?

IND vs BANG: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసే ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) ఫిబ్రవరి19వ తేదీ నుంచి ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగ్గా.. కివిస్ జట్టు విజయం సాధించింది. అయితే టీమిండియా (India) నేడు తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో (Bangladesh) ఆడనుంది. కొన్ని భద్రతా కారణాల వల్ల టీమిండియా పాకిస్థాన్ వెళ్లడం లేదు. ఈ కారణం వల్లనే హైబ్రిడ్ మోడల్లో (Hybrid Model) మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడనుంది. భారత్‌తో జరిగే అన్ని మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరగన్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma) ఉండగా, బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ ఉన్నాడు. ఈ రోజు జరిగే ఆ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందా? లేకపోతే బంగ్లాదేశ్ గెలుస్తుందా? అనేది చూడాలి. అయితే బంగ్లాదేశ్ షకీబ్ల్ హసన్ లేకుండా మొదటిసారి ఇంత పెద్ద టోర్నీ ఆడుతుంది. 2004 తర్వాత మళ్లీ ఇప్పుడే పెద్ద టోర్నీ ఆడుతోంది. అయితే అందరూ కూడా యువ బ్యాటర్లు ఉండటంతో టీమిండియా గెలిచే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కెప్టెన్ నజ్ముల్ కూడా గత కొంత కాలం నుంచి ఫామ్‌లో లేడు. దీంతో బంగ్లాదేశ్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.. స్పిన్ ఆల్‌రౌండర్ మెహదీ మిరాజ్పైనే. మరి టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విషయంలో ఎలా ఆడుతుందో చూడాలి.
టీమిండియా ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో తలపడనుంది. క్రికెట్ ప్రేమికులు అందరూ కూడా ఈ మ్యాచ్ కోసమే ఎదురు చూస్తున్నారు. అయితే టీమిండియా గ్రూప్ స్టేజ్‌లో ఆడే మ్యాచ్‌లు అన్ని కూడా దుబాయ్‌లో జరగనున్నాయి. గ్రూప్ ఏలో భారత్ బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిల్యాండ్‌తో ఆడుతాయి. వీటిలో రెండు మ్యాచ్‌లు అయినా కూడా భారత్ గెలిస్తే సెమీస్‌కు వెళ్తుంది. లేకపోతే సెమీస్‌కు వెళ్లడం కష్టమే. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ మార్చి 4వ తేదీన జరగనుంది. అయితే గ్రూప్-బీలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. వీటిలో ఏదో ఒక జట్టు సెమీస్‌కి వెళ్తుంది. ఇలా రెండు జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరగనుంది. అయితే టీమిండియా సెమీస్‌కు క్వాలిఫై కాకపోతే సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు అన్ని కూడా పాక్ వేదికగానే జరుగుతాయి. ఒకవేళ సెమీస్‌కు క్వాలిఫై అయితే దుబాయ్‌లోనే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లను డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమాలో చూడవచ్చు.
టీమిండియా జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్ (వికట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్.
బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ (కెప్టెన్), తన్జీద్, సౌమ్య సర్కార్, తౌహీద్, ముష్పికర్, మహ్ముదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్, తస్కీన్, నాహిద్, ముస్తఫిజుర్.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!