IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్.. రూ.5 వేల కోట్లకు పైగా బెట్టింగ్

IND vs NZ:
నేడే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురు చూస్తున్నారు. దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే సాధారణంగా చిన్న మ్యాచ్‌లు అంటేనే బెట్టింగ్ లు వేసుకుని ఆడుతుంటారు. అలాంటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అంటే చెప్పక్కర్లేదు. అందులోనూ టీమిండియా ఫైనల్‌కి చేరడంతో భారీ సంఖ్యలో బెట్టింగ్‌లు ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫైనల్ మ్యాచ్‌పై దాదాపు రూ.5వేల కోట్లకు పైగా బెట్టింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న మ్యాచ్‌లకే బెట్టింగ్ వేసే వారు ఫైనల్ మ్యాచ్ అంటే బెట్టింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో కాస్త ఆలోచించుకోండి. అయితే ఇటీవల ఢిల్లీ పోలీసులు బెట్టింగ్‌లు వేస్తున్న వారిని అరెస్టు చేశారు. భారత్, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్ మ్యాచ్ సమయంలో కొందరు బెట్టింగ్‌లకు పాల్పడ్డారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర ల్యాప్ టాప్స్, మొబైల్స్ తీసుకున్నారు. అయితే వీటి ద్వారా కొన్ని సంచలన విషయాలు బయట పడ్డాయి. ఓ వెబ్‌సైట్‌లో మాస్టర్ ఐడీని ఉపయోగించి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. వీరు ఒక్కో లావాదేవీపై 3 శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. మరికొందరు అయితే ఇంటి అద్దె చెల్లించి కొన్నింటిని బెట్టింగ్ కేంద్రాలుగా మారుస్తున్నారు. కేవలం మొబైల్ ఫోన్ల ద్వారానే కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా క్రికెట్ మ్యాచ్‌పై పందెలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బెట్టింగ్‌లకు అండర్ వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీంకి డి కంపెనీతో కాస్త సంబంధాలు ఉన్నాయి. ఈ గ్యాంగ్ ఈ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌కి బాగా బెట్టింగ్‌లకు పాల్పడుతుంది. అయితే ఢిల్లీలో పోలీసులు వారి దగ్గర నుంచి రూ.22 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 19న ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ చివరి దశకు చేరుకుంది. ఈ టోర్నీలో మొదటి సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడగా.. టీమిండియా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు రెండో సెమీ ఫైనల్‌లో తలపడగా ఇందులో న్యూజిలాండ్ గెలిచింది. దీంతో ఈ ఇరు జట్లు నేడు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మరి టీమిండియా విజయం సాధిస్తుందో లేదో చూడాలి. కివీస్‌తో పోటీ అంటే కాస్త కష్టమే. కివీస్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. స్టార్ ప్లేయర్లు అందరూ కూడా ఇందులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా జట్టు కూడా ఫామ్‌లోకి వచ్చింది. అన్ని మ్యాచ్‌లు వరుసగా గెలిచిన టీమిండియా ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఏం చేస్తుందో చూడాలి.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్