IPL 2025 : నేడే ఎలిమినేటర్ మ్యాచ్.. గెలిచేదెవరు?
IPL 2025 : ఐపీఎల్ సీజన్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు క్వాలిఫైయర్ 1 లో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. పంజాబ్‌ను చిత్తుగా ఓడించి ఆర్సీబీ జట్టు గెలిచింది. అయితే నేడు ఏలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్టు ఢీకొట్టనున్నాయి.

IPL 2025:ఐపీఎల్ సీజన్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు క్వాలిఫైయర్ 1 లో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. పంజాబ్‌ను చిత్తుగా ఓడించి ఆర్సీబీ జట్టు గెలిచింది. అయితే నేడు ఏలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్టు ఢీకొట్టనున్నాయి. అయితే గుజరాత్ జట్టు ముందును నుంచే అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ఈ క్రమంలోనే ప్లేఆఫ్స్‌కు చేరాయి. ముంబై జట్టు మొదట్లో సరిగ్గా ఆడకపోయినా తర్వాత బాగా ఆడటంతో ప్లేఆఫ్స్‌కు చేరాయి. ఈ రెండు జట్లుకు నేడు ఛండీఘర్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన మ్యాచ్ ఫైనల్‌లో ఆర్సీబీతో తలపడనుంది. ఓడిన మ్యాచ్ ఇంటికి వెళ్లిపోనుంది. నేటి నుంచి ఈ రెండు జట్లుకు చావో రేవో వంటిది. అయితే విదేశీ ఆటగాళ్లు ఇప్పటికే మ్యాచ్‌ను వదిలేసి వెళ్లారు. గుజరాత్ టైటాన్స్ టైటిల్ రేసులో ఉన్నారు. కానీ వరుస ఓటములతో మొదటి స్థానం నుంచి పడిపోయారు. పేసర్ సిరాజ్ ఇప్పుడ వికెట్లు పడగొట్టడం గుజరాత్ టైటాన్స్ జట్టుకు చాలా ముఖ్యం. దీంతో బ్యాటింగ్ ఆర్డర్ మారనుంది. దీనివల్ల జట్టుకు కాస్త ఇబ్బంది ఉంది. మిడిల్ ఆర్డర్ ఎలా ప్లాన్ చేస్తుందో చూడాలి.
Read Also: రూపాయి తయారీపై నష్టం.. రూ.500పై లాభం .. ఆర్‌బీఐ షాకింగ్ నివేదిక!
విదేశీ ఆటగాళ్లు వెళ్లిపోవడం వల్ల ముంబై జట్టుకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఓపెనర్‌గా రాణించిన రికిల్‌టన్ (దక్షిణాఫ్రికా), ఇంగ్లాండ్ బ్యాటర్ విల్ జాక్స్ స్వదేశాలకు వెళ్లిపోయారు. కొత్తగా జట్టులోకి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో, రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సూర్య కుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇది ముంబై జట్టుకు చాలా ముఖ్యం. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు? ముంబై జట్టు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.
Read Also: సామాన్యులనే కాదు..బ్యాంకులనూ దోచేస్తున్న కేటుగాళ్లు..ఏడాదిలో 3రెట్లు పెరిగిన సైబర్ మోసాలు
ముంబై జట్టు అంచనా
రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్, విదేశీ ఆటగాడు, అరంగేట్రం), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్ (విదేశీ ఆటగాడు), నెహాల్ వధేరా / రమణ్‌దీప్ సింగ్, కుమార్ కార్తికేయ / శ్రేయాస్ గోపాల్ (స్పిన్నర్), జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వల్, గెరాల్డ్ కోయెట్జీ / నువాన్ తుషార (విదేశీ ఆటగాడు, పేసర్)
-
IPL 2025: నేడే ఆసక్తికర మ్యాచ్.. ఫైనల్‌క వెళ్లేదెవరు? ఇంటికెళ్లేదెవరు?
-
Jitesh Sharma: రికార్డు సృష్టించిన జితేష్ శర్మ.. ధోని రికార్డును బద్దలు కొట్టి..!
-
Kohli Emotion: విన్నింగ్ రన్.. కోహ్లీ ఏమోషన్.. ఆర్సీబీ విజయం వీడియో వైరల్
-
Those two behind Punjab Kings: పంజాబ్ కింగ్స్ వెనుక ఆ ఇద్దరు.. వారి వల్లే టాప్ 2 ప్లేస్ సొంతం
-
Surya Kumar Yadav breaks World Record: టీ20ల్లో వరల్డ్ రికార్డును బీట్ చేసిన సూర్య కుమార్ యాదవ్
-
A Cricket match that made History: చరిత్ర సృష్టించిన క్రికెట్ మ్యాచ్.. 2 పరుగులకే ఆలౌట్, 8మంది డకౌట్