IPL 2025 final, RCB vs PBKS: నేడే తుది సమరం.. ఏ జట్టు గెలిచినా చరిత్రే
IPL 2025 final, RCB vs PBKS: ప్రతీసారి ఈ రెండు జట్లుకు కప్ ఒక కలగానే మిగిలిపోయింది. బెంగళూరు జట్టు అయితే ఈసాలా కప్ నమ్‌దే అంటూ భారీ అంచనాలతో మ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. మొదట్లో బాగానే ఆడినా చివరకు వెళ్లి ఓడిపోతుంది.

IPL 2025 final, RCB vs PBKS: ఐపీఎల్ 2025లో నేడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు కూడా కప్పు కోసం 18 ఏళ్ల నుంచి ఎదురు చూస్తుంది. మూడేళ్ల కిందట ఐపీఎల్‌లోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా చివరకు కప్పు కొట్టింది. కానీ ఈ రెండు జట్లు మాత్రం 18 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాయి. ప్రతీసారి ఈ రెండు జట్లుకు కప్ ఒక కలగానే మిగిలిపోయింది. బెంగళూరు జట్టు అయితే ఈసాలా కప్ నమ్‌దే అంటూ భారీ అంచనాలతో మ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. మొదట్లో బాగానే ఆడినా చివరకు వెళ్లి ఓడిపోతుంది. మూడు సార్లు కప్పు చేతి వరకు వచ్చి జారిపోయింది. అయితే ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు ముందు నుంచే అద్భుతమైన ప్రదర్శన చేసింది. మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రతీ మ్యాచ్‌లో తన మార్క్ చూపించింది. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ కూడా దూకుడుగా ఆడాడు. ఆర్సీబీ జట్టు ఈ సీజన్‌లో అయినా కప్ కొట్టాలని ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. పక్కాగా ఈసారి ఆర్సీబీ జట్టు కప్పు కొడుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే జట్టు దూకుడుగా ఆడుతోంది. ఆర్సీబీ విజయం సాధిస్తే కొత్త చరిత్ర సృష్టించినట్లే.
Also Read: IPL 2025 : ఫైనల్‌లో ‘ముస్తాక్ అలీ ట్రోఫీ’ రిపీట్ అవుతుందా? అయ్యర్ కాన్ఫిడెన్స్ నిజమవుతుందా ?
ఇక పంజాబ్ జట్టు 2014లో ఫైనల్‌కు చేరింది. ఇప్పటి వరకు మళ్లీ ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. అయితే శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఫైనల్‌గా పంజాబ్ జట్టు ఫైనల్‌కి చేరింది. అయితే ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు మొదటి నుంచి నిలకడగా ఆడుతూనే వస్తుంది. శ్రేయస్ అయ్యర్ ముందు ఉండి జట్టును నడిపించాడు. గతేడాది శ్రేయస్ అయ్యర్ కోల్‌కతా జట్టుకు కప్‌ను అందించాడు. కానీ ఆ గొప్పతనం అతనికి అందలేదు. అయితే శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో తప్పకుండా పంజాబ్ జట్టు కప్ కొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ జట్టు కూడా 18 ఏళ్ల నుంచి కప్ కోసం ఎదురు చూస్తుంది. పంజాబ్ జట్టు కప్ కొట్టినా కూడా కొత్త చరిత్ర మొదలైనట్లే. మరి అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఏ జట్టు చరిత్ర సృష్టించబోతుందో చూడాలి.
ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి 19 పాయింట్లతో ఫైనల్‌కు చేరింది. బెంగళూరు జట్టు కూడా ఇలానే అద్భుతమైన ప్రదర్శన చేసింది. కానీ రన్ రేటు తక్కువగా ఉండటం వల్ల రెండో స్థానంలో ఉంది. ఏది ఏమైనా రెండు జట్లు కూడా ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాయి.
-
RCB Stampede: ఆర్సీబీ తొక్కిసలాట.. రిపోర్టు లో సంచలన విషయాలు
-
YouWeCan : సచిన్, కోహ్లీ, పీటర్సన్.. యువీ ఛారిటీ కోసం తరలివచ్చిన క్రికెట్ దిగ్గజాలు!
-
Jasprit Bumrah : కెప్టెన్సీ ఆఫర్‌ను తిరస్కరించిన బుమ్రా.. బీసీసీఐకి ‘నో’ చెప్పడానికి గల అసలు కారణం ఇదే!
-
Virat Kohli : ‘కోహ్లీతో నా కూతురికి పెళ్లి చేస్తా’: స్టార్ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
IPL 2025 : ఐపీఎల్ వేలంలో రూ. 20 కోట్ల బిడ్..వాష్ రూంలోకి పరిగెత్తిన శ్రేయాస్ అయ్యర్!
-
Bengaluru Stampede : విరాట్ కోహ్లీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు