IPL ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. KKR, RCB మ్యాచ్ రద్దు!

IPL:
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ఒక్కరోజే ఉంది. 18 వ ఎడిషన్ మార్చ్ 22 అంటే శనివారం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య రసవత్తరంగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్ల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చే వార్త బయటకొచ్చింది. తొలి మ్యాచ్ కు వరుణుడి ముప్పు పొంచి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
దీంతో ఆ రోజు మ్యాచ్ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రేపు జరగాల్సి ఉంది. అదే సమయంలో ఆ నగరానికి భారీ వర్ష సూచన వస్తుండడంతో ఈ తొలి మ్యాచ్ రద్దు అవడం ఖాయమనే అంచనాలు నెలకున్నాయి. అంతేకాకుండా ఈ మ్యాచ్ కు ముందు గ్రాండ్ ఓపెనింగ్ సెర్మని కూడా ఏర్పాటు చేశారు. దీనికోసం బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు సందడి చేయనున్నారు. అందులో శ్రేయ ఘోషల్ సాంగ్స్ తో హోరెత్తించనుండగా.. దిశాపటాని డాన్స్ తో దుమ్ము దులిపేయనుంది. అయితే ఇదంతా ఆరోజు వర్షం పడకుండా ఉంటే జరగాల్సిన కార్యక్రమం. కానీ భారత వాతావరణ శాఖ కోల్‌కతాలో భారీ వర్షాలు కురవనున్నాయని సమాచారం ఇస్తుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది. దీంతో కేకేఆర్ vs ఆర్ సి బి మధ్య తొలి మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. అంతేకాకుండా అటు ప్రాంతీయ వాతావరణ శాఖ కూడా ఇదే విషయం చెబుతోంది. మార్చి 20 నుంచి 22 వరకు ఆ నగరంలో ఆరంజ్ అలర్ట్ జారీచేసింది. దీంతో అభిమానులు, క్రికెట్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ను తొలి మ్యాచ్ లోనే సొంత గడ్డపై చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కోహ్లీ బ్యాట్ పట్టి బాదుతుంటే చూడాలని ఇంకొందరు వెయిట్ చేస్తున్నారు. అందులోనూ ఇరు జట్లకు కొత్త కెప్టెన్ లు నియమించబడ్డారు. కేకేఆర్ కు అజింక్య రహేనా, ఆర్సిబికి రజిత పాటిదర్ కెప్టెన్లగా బాధ్యతలు తీసుకున్నారు. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే
-
Tilak Varma: తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్.. తెలుగు కుర్రాడికి ఘోర అవమానం
-
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను గుడ్ న్యూస్.. బుమ్రా ఎంట్రీ అప్పుడే?