IPL 2025: నేడే ఆసక్తికర మ్యాచ్.. ఫైనల్‌క వెళ్లేదెవరు? ఇంటికెళ్లేదెవరు?

IPL 2025: నేడు ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఫైనల్‌లో ఆర్సీబీతో తలపడడానికి నేడు పంజాబ్, ముంబై జట్లు మధ్య మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్ 2లో గెలిచిన జట్టు ఫైనల్‌లో ఆర్సీబీతో ఆడనుంది. అయితే ముంబై జట్టు ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. పంజాబ్ జట్టు ఇప్పటి వరకు సాధించలేదు. మొదటి ట్రోఫీ కోసం హోరాహోరీగా పోటీపడుతోంది. అయితే ఈ సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ జట్టు మొదటి నుంచి అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అయితే క్వాలిఫయర్ 1లో మాత్రం పేలవమైన ప్రదర్శన కనబరిచింది. దీంతో ఎలాగైనా కూడా ముంబైపై గెలవాలనే కసితో ఉంది. ముంబై జట్టు ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఫామ్‌లో ఉంది. రెండు జట్లు కూడా ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని జోరు మీద ఉన్నాయి.
టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న గుజరాత్‌ను ముంబై జట్టు ఎలిమినేటర్‌లో ఓడించింది. ఫైనల్‌కి చేరి ఎలాగైనా కూడా టైటిల్ గెలవాలని భావిస్తోంది. ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు ఆరో సారి కూడా టైటిల్ గెలవాలని భావిస్తోంది. అదే జోరు మీద ఉంది. అయితే మిగతా జట్లుతో పోలిస్తే ముంబై జట్టు నాకౌట్ జట్లులో బాగా ఆడుతుంది. అయితే ముంబై జట్టు కూడా ఫామ్‌లో ఉంది. అన్ని విభాగాల్లో కూడా ముంబై జట్టు రాణిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ అన్నింటి పరంగా చూస్తే ఈసారి ఫైనల్‌కి వెళ్తే పక్కాగా కప్పు కొట్టే అవకాశం ఉందని అంటున్నారు. అయితే పంజాబ్‌ను కూడా ఓడించి ముంబై జట్టు ఫైనల్‌కు వెళ్తుందని అంటున్నారు. జట్టులో ఉన్నవారందరూ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్లు, సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. తిలక్ వర్మ, హార్డిక్ కూడా బాగానే ఆడుతున్నారు. అయితే ఈ మ్యాచ్ పంజాబ్‌కు పెద్ద సవాల్. అయితే ఒకవేళ వర్షం పడితే మాత్రం పాయింట్ల టేబుల్ ప్రకారం పంజాబ్ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.
తుది జట్లు (అంచనా)
పంజాబ్: ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయస్, వధేరా, శశాంక్ సింగ్, స్టాయినిస్, అజ్మతుల్లా, హర్‌ప్రీత్ బ్రార్, జేమీసన్, చాహల్, వైశాఖ్ విజయ్‌కుమార్.
ముంబై: రోహిత్, బెయిర్‌స్టో, సూర్యకుమార్, తిలక్, హార్దిక్, నమన్ ధీర్, శాంట్నర్, రాజ్ బవా, రిచర్డ్ గ్లీసన్, బుమ్రా, బౌల్ట్, అశ్వని కుమార్.
ఇది కూడా చూడండి: Khaleja Re-release : ఖలేజా సినిమాకు పాముతో వచ్చిన మహేష్ ఫ్యాన్.. ఓర్నీ ఇంత సాహసం అవసరమా ?
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!
-
IPL 2025 Final: రిజర్డ్వ్ డే రోజు వర్షం పడితే.. విన్నర్ ఇక ఆ జట్టే!
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్‌కు భారీ భద్రత.. షాక్ కొడుతున్న టికెట్ రేట్లు
-
IPL 2025 : ఐపీఎల్ ఫైనల్ కు వరుణ గండం.. మోదీ పిచ్ ఎవరికీ కలిసొస్తుంది ?
-
IPL 2025: ఫైనల్‌కు వెళ్లిన సంతోషమే లేదు.. శ్రేయస్ అయ్యర్‌కు బిగ్ షాక్
-
IPL 2025 : నేడే ఎలిమినేటర్ మ్యాచ్.. గెలిచేదెవరు?