KKR vs RCB : బోణీ కొట్టిన ఆర్సీబీ.. ఇదే దూకుడుతో ఫైనల్ వరకు కొనసాగుతుందా?

KKR vs RCB: అట్టహాసంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు ఘన విజయం సాధించింది.
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ బోణీ కొట్టింది. 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఆర్సీబీ ఓడించింది. ఆర్సీబీ జట్టు మొత్తం దూకుడు మీద ఆడారు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ ఆర్సీబీ జట్టు దూకుడు కొనసాగించింది. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 175 లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఆర్సీబీ 16.2 ఓవర్లలోనే 175 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలిచింది. సొంత గడ్డపైనే కోల్‌కతాను ఓడించింది. విరాట్ కోహ్లీ (59*), ఫిల్ సాల్ట్ (56) ఆఫ్ సెంచరీలు చేశాడు. కెప్టెన్ రజత్ పటీదార్ (34) పరుగులు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ ఆర్సీబీ జట్టు రాణించింది. ఇదే దూకుడు మీద ఫైనల్ వరకు ఆడితే ఈ సారి ఆర్సీబీ కప్పు కొట్టడం పక్కా.
వరుస ఓటముల తర్వాత బెంగళూరు జట్టు రాణించింది. గతేడాది దూకుడు మీద ఆడి సెమీస్ వరకు వెళ్లి దురదృష్టవశాత్తు ఓడిపోయింది. దీంతో ఈ సీజన్‌లో అయినా తప్పకుండా కప్ కొట్టాలని రాయల్స్ బెంగళూరు యాజమాన్యం వేలంలో అద్భుతమైన ప్లేయర్లను తీసుకుంది. గత సీజన్‌లో ఉన్నవారిని కాకుండా మిగతా వారికి అవకాశం ఇచ్చింది. గత సీజన్‌లో ఉన్న డూప్లెసిస్‌కు బదులు రజత్ పాటిదర్‌ను తీసుకుంది. ఈసారి వేలంలో ఆర్సీబీ యాజమాన్యం కృనాల్ పాండ్యాను తీసుకుంది. మొదటి మ్యాచ్‌తోనే తాను ఏంటో నిరూపించుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే కృనాల్ పాండే మూడు వికెట్లు తీశాడు. గత సీజన్‌లో ఆర్సీబీ, కోల్‌కతా జట్టు మధ్య రెండు మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో రెండు మ్యాచ్‌లలో కూడా కోల్‌కతా జట్టు గెలిచింది. గత సీజన్‌లో ఓడిపోయిన ఆర్సీబీ జట్టు ఈసారి ఎలాగైనా గెలవాలని వేలంలో అద్భుతమైన ఆటగాళ్లను తీసుకుంది. ఈ సీజన్‌లో ఎలాగైనా ఆర్సీబీ కప్ కొడుతుందని ఫ్యా్న్స్ ఆశగా చూస్తున్నారు. మరి ఆర్సీబీ జట్టు ఆ కలను నెరవేరుస్తుందో లేదో చూడాలి.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే
-
Tilak Varma: తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్.. తెలుగు కుర్రాడికి ఘోర అవమానం
-
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను గుడ్ న్యూస్.. బుమ్రా ఎంట్రీ అప్పుడే?