Kohli Emotion: విన్నింగ్ రన్.. కోహ్లీ ఏమోషన్.. ఆర్సీబీ విజయం వీడియో వైరల్
ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. ఆరు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టును ఆర్సీబీ ఓడించింది. ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్-2కు చేరింది. అయితే గురువారం క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ తలపడనుంది.

Kohli Emotion: ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. ఆరు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టును ఆర్సీబీ ఓడించింది. ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్-2కు చేరింది. అయితే గురువారం క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ గెలవడంతో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తోటీ ప్లేయర్లతో కలిసి సంబరాలు చేసుకున్నారు. కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ విన్నింగ్‌తో ఆర్సీబీ ఫ్యా్న్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో పాటు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్యాలరీలో ఉన్న అనుష్క శర్మకు విరాట్ కోహ్లీ సైగలు చేస్తూ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చాడు. ఆ తర్వాత అనుష్క శర్మ కూడా ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. వీరిద్దరి ప్రేమ ఎంత బాగుందో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి వీరిని గ్రౌండ్ లో చూడటానికి చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఎప్పుడూ కూడా మ్యాచ్‌లో వీరిద్దరి మద్య రొమాన్స్ బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు.
Read Also: ఈ చెట్టు ఆకు వాటర్ తాగితే.. చిటికెలో అనారోగ్య సమస్యలన్నీ పరార్
ఉత్కంఠంగా ఈ మ్యాచ్ చివరి వరకు సాగింది. ఈ మ్యాచ్‌లో జితేష్ కొట్టిన సిక్సర్ తో బెంగళూరు జట్టు గెలిచింది. దీంతో ఆర్సీబీ జట్టు ఆనందంలో మునిగి తేలింది. ఆటగాళ్లు ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. జితేష్ శర్మ సిక్సర్ కొట్టిన వెంటనే విరాట్ కోహ్లీ అయితే ఆనందంతో ఒక్కసారిగా ఎగిరి గంతులు వేశాడు. పక్కనే ఉన్న కృణాల్ పాండ్యాను గట్టిగా హత్తుకున్నాడు. టాప్ 2లోకి వెళ్లిపోయామని హ్యాపీ ఫీల్ అయ్యాడు. బెంగళూరు మ్యాచ్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి విరాట్ కోహ్లీ బయటకు వచ్చి మైదానంలోకి వెళ్లాడు. అక్కడ జితేష్ శర్మకు శుభాకాంక్షలు తెలియజేసి హగ్ చేసుకున్నాడు. జట్టును గెలిపించినందుకు థాంక్స్ అంటూ చెప్పాడు. బెంగళూరు జట్టును గెలిపించావుని విరాట్ కోహ్లీ జితేష్ శర్మను ఉద్దేశించాడు. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కూడా ఆడాడు. అర్థ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యాన్ని లక్నో జట్టు ఉంచినప్పటికీ ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది.
https://x.com/imkevin149/status/1927432812090573297
-
IPL 2025 : ఐపీఎల్ వేలంలో రూ. 20 కోట్ల బిడ్..వాష్ రూంలోకి పరిగెత్తిన శ్రేయాస్ అయ్యర్!
-
Bengaluru Stampede : విరాట్ కోహ్లీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు
-
Anushka Sharma: ఐపీఎల్ ఫైనల్‌లో అనుష్క శర్మ ధరించిన కాస్ట్లీ ప్రొడక్ట్స్
-
IPL 2025: ఆర్సీబీ విజయానికి కలిసొచ్చిన ఆపరేషన్ సింధూర్
-
Virat Kohli Sensational Comments Rohit: రోహిత్‌పై కోహ్లీ సంచలన కామెంట్స్.. ఇంపాక్ట్ చూపించడం లేదంటూ..?
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!