Easy Sleep: 4-7-8 టెక్నిక్‌తో ఈజీ స్లీప్
ప్రతీ మనిషికి నిద్ర అనేది తప్పనిసరి. శరీరానికి సరిపడా నిద్ర ఉండాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. మారిన జీవనశైలి వల్ల ప్రస్తుతం చాలా మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. సోషల్ మీడియాకి బానిసై అర్థరాత్రి వరకు మొబైల్స్ చూసుకుంటూ నిద్రను వెనక్కి నెడుతున్నారు.

Easy Sleep: ప్రతీ మనిషికి నిద్ర అనేది తప్పనిసరి. శరీరానికి సరిపడా నిద్ర ఉండాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. మారిన జీవనశైలి వల్ల ప్రస్తుతం చాలా మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. సోషల్ మీడియాకి బానిసై అర్థరాత్రి వరకు మొబైల్స్ చూసుకుంటూ నిద్రను వెనక్కి నెడుతున్నారు. దీనివల్ల ఎక్కువగా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఏదో ఒక రోజు ఆలస్యంగా నిద్రపోతే పర్లేదు.. కానీ డైలీ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం శారీరక మాత్రమే కాకుండా మానసిక సమస్యల బారిన కూడా పడతారు. మనిషి ఆరోగ్యంగా ఉండటంలో నిద్ర ముఖ్య పాత్ర వహిస్తుంది. డైలీ వేగంగా నిద్రపోతే ఎలాంటి సమస్యలు ఉండవు. అదే ఆలస్యంగా నిద్రపోతే ప్రమాదకర వ్యాధులు బారిన పడతారు. కొందరు అయితే నిద్రపోవడానికి ఎన్నో యుద్ధాలే చేస్తారు. అయితే ఈజీగా నిద్ర పట్టాలంటే చిన్న టెక్నిక్ ఉపయోగిస్తే చాలని నిపుణులు అంటున్నారు. మరి టెక్నిక్ ఏంటో తెలియాలంటే ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.
నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ పాటించాలి. ఈ టెక్నిక్ ద్వారా ఎవరికైనా కూడా ఈజీగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అయితే ఈ టెక్నిక్‌లో 4 సెకన్ల పాటు ముక్కు ద్వారా గాలి పీల్చుకోవాలి. ఆ తర్వాత 7 సెకన్ల పాటు గాలిని పీల్చి ఉంచాలి. ఆ తర్వాత 8 సెకన్లు నోటి ద్వారా గాలిని వదిలేయాలి. ఇలా చేస్తే తప్పకుండా మీకు వెంటనే నిద్రపడుతుంది. మెడిటేషన్, యోగా చేస్తూ.. శ్వాస తీసుకోవాలి. ఇలా చేస్తే తప్పకుండా కళ్లు మూసిన వెంటనే నిద్ర పడుతుంది. అయితే ఈ టెక్నిక్‌ను కూర్చోని కాకుండా పడుకుని చేయాలి. మీకు కంఫర్ట్ అనిపించే పొజిషన్‌లో కూర్చోవాలి. ఆ తర్వాత 4 సెకన్ల పాటు శ్వాస పీల్చుకుని 7 నిమిషాలు పట్టి వదిలేయాలి. ఇలా నాలుగు నుంచి ఐదు సార్లు చేయడం వల్ల మీకు కళ్లు మూసిన వెంటనే హాయిగా నిద్రపడుతుందని నిపుణులు అంటున్నారు.
ఈ బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో కావడం వల్ల ఒత్తిడి, ఆందోళన అన్ని కూడా తగ్గుతాయి. అలాగే నిద్రలేమి సమస్య నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఎన్ని టెన్షన్‌లు ఉన్నా కూడా హాయిగా నిద్రపోతారు. అసలు పూర్తిగా మీకు నిద్ర లేమి సమస్యే రాదు. అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా దాన్ని ఈజీగా పరిష్కరించుకుంటారు. ప్రతీ విషయంలో కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఇలా బ్రీతింగ్ అనేది కేవలం పడుకుని నిద్రపోయే సమయంలో కాకుండా సాధారణ సమయంలో కూర్చోని చేసినా మంచిదే. యోగా, మెడిటేషన్ వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా హ్యాపీగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Richest Flight: ఓర్నీ.. ఈ గబ్బిలాల విమానం ఖరీదు రూ.16 వేల కోట్లా!
-
Traffic Challan : చలాన్ల నుంచి తప్పించుకోవాలంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ యాప్‌లు ఆన్ చేయండి
-
Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్
-
Electric Vehicle Battery : తక్కువ ఖర్చు.. ఎక్కువ దూరం.. బ్యాటరీ టెక్నాలజీలో గేమ్ ఛేంజర్
-
Meta: మేటా స్మార్ట్ గ్లాసెస్ చూశారా.. ఫీచర్లు అయితే అదుర్స్
-
ChatGPT: చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. అన్ని ఫొటోలు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు