Telangana TET: తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎప్పటి నుంచంటే?

Telangana TET: ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా మందికి మక్కువ ఎక్కువ. అందులోనూ టీచర్ ఉద్యోగమంటే కళ్లు మూసుకుని చేసుకుంటారు. ఇంటికి సమీపంలో ఉద్యోగం, సెలవులు, జీతం అన్ని కూడా బాగుంటాయని ఇష్టపడతారు. అయితే తెలంగాణ ప్రభుత్వం టెట్ పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. జూన్ 18వ తేదీ నుంచి టెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. అన్ని సబ్జెక్టుల పరీక్షలు ఈ నెల 30వ తేదీకి పూర్తి అవుతాయి. వీటితో పాటు అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది. పరీక్షలు దగ్గర పడటంతో అభ్యర్థులు ఫ్రీగా మాక్ టెస్టులు రాసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ క్రమంలోనే వెబ్‌సైట్‌లో వీటి వివరాలను పొందుపరిచింది. టెట్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఉచితంగా మాక్ టెస్ట్‌లు రాసుకోవచ్చు. https://tgtet.aptonline.in/tgtet/ వెళ్లి మాక్ టెస్ట్‌లు రాయాలి. అందులోకి వెళ్తే టీజీ టెట్ మాక్ టెస్ట్ 2025 అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని సైన్ ఇన్ చేసి క్లిక్ చేయాలి. అలా చేశాక ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది. మీరు ఇందులో ఎన్నిసార్లు అయినా కూడా పరీక్షలు రాయవచ్చు. దీనివల్ల మీకు పరీక్షలకు ప్రాక్టీస్ అవుతుంది.
ఇది కూడా చూడండి:IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!
పరీక్షల్లో ఇంకా ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. టెట్‌లో క్వాలిఫై కావటంతో పాటు మంచి స్కోర్ సాధిస్తారు. అలాగే డీఎస్సీలో ఈ మార్కుల వల్ల వెయిటేజీ కూడా లభిస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి టీచర్ ఉద్యోగం కోసం కలలు కంటున్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ మాక్ టెస్టుల వల్ల ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? పరీక్షలో సమయాన్ని ఎలా మ్యానేజ్ చేసుకోవచ్చు? అన్ని తెలుస్తాయి. దీనివల్ల మీకు పరీక్షను ఎలా రాయాలనే క్లారిటీ వస్తుంది. అయితే 1,83,653 మంది అభ్యర్థులు టెట్‌కు అప్లై చేసుకున్నారు. 63,261 అభ్యర్థులు పేపర్-1కు, 1,20,392 మంది అభ్యర్థులు పేపర్-2కు ఉన్నారు.
తెలంగాణ టెట్ పరీక్షలు రోజూ కూడా రెండు సెషన్లలో జరుగుతాయి. మార్నింగ్ 9 నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుంది. అయితే జూన్ 9వ తేదీన హాల్ టికెట్లు వస్తాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాలి. టెట్ పరీక్షలు జూన్ 30 వ తేదీకి పూర్తయ్యాక ప్రాథమిక కీలను రిలీజ్ చేస్తారు. అయితే వీటిపై అభ్యంతరాలను స్వీకరించి పరిశీలిస్తారు. తుది ఫలితాలను జూలై 22వ తేదీన విడుదల చేస్తారు.
-
Telangana Heavy Rains: తెలంగాణలో ఆ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
-
Telangana Rains: వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
-
Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
-
Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Telangana Rains: తెలంగాణలో ఆ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
-
Telangana Rains: దంచికొడుతోన్న భారీ వర్షాలు.. కీలక అలర్ట్