Weight Lose: వెయిట్ తగ్గాలని అధికంగా రన్నింగ్ చేస్తే ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
జీవనశైలి, ఆహార అలవాట్లు మారడం వల్ల చాలా మంది ఈ రోజుల్లో ఊబకాయం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాలు ఉండే ఫుడ్ కాకుండా.. మసాలా, చీజ్, కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటివల్ల ఊబకాయం బారిన పడుతున్నారు.

Weight Lose: జీవనశైలి, ఆహార అలవాట్లు మారడం వల్ల చాలా మంది ఈ రోజుల్లో ఊబకాయం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాలు ఉండే ఫుడ్ కాకుండా.. మసాలా, చీజ్, కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటివల్ల ఊబకాయం బారిన పడుతున్నారు. ఊబకాయం సమస్య వస్తే వెంటనే తగ్గించుకోవాలి. లేకపోతే ఇంకా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ప్రొటీన్ పౌడర్లు వాడటం, వాకింగ్, జిమ్, రన్నింగ్ వంటివి చేస్తారు. అయితే వీటిలో రన్నింగ్ చేయడం వల్ల తొందరగా బరువు తగ్గుతారని చాలా మంది భావిస్తారు. ఎందుకంటే రన్నింగ్ చేయడం వల్ల బాడీ కదులుతుంది. దీంతో బాడీలో ఉంటే కొవ్వులు ఈజీగా కరిగిపోతాయి. దీనివల్ల బరువు తగ్గుతారని చాలా మంది అనుకుంటారు. వారికి కనీసం రన్నింగ్ చేసే అలవాటు లేకపోయినా కూడా బరువు తగ్గాలని ఒక్కసారిగా రన్నింగ్ చేస్తారు. ఏదో లైట్‌గా కాకుండా అధికంగా చేసి.. అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటారు. అయితే ఒక్కసారిగా రన్నింగ్ అధికంగా చేస్తే వచ్చే ప్రమాదాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: ఇక్కడ హైహీల్స్ వేసుకున్నారో.. జైలుకు వెళ్లడం ఖాయం
అధికంగా ఒక్కసారి రన్నింగ్ చేస్తే బాడీలో కొవ్వులు తగ్గుతాయి. అలాగే శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. దీనివల్ల కొందరికి రక్తపోటు కూడా పెరుగుతుంది. రక్తపోటు అధికం అయితే మాత్రం తప్పకుండా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఒక్కసారిగా రన్నింగ్ అధికంగా చేయకూడదు. కాస్త లిమిట్‌లో తక్కువగా చేసుకుంటూ వెళ్లాలి. మొదటి రోజు కిలో మీటరు పరుగెడితే.. తర్వాత ఇంకా కాస్త ఇలా దూరాన్ని పెంచుకుంటూ పోవాలి. అంతే కానీ ఎక్కువ దూరం ఒకేసారి రన్నింగ్ చేయకూడదు. రన్నింగ్ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఇలా ఒక్కసారిగా అధికంగా చేయడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. రన్నింగ్ చేయడం వల్ల బాడీలోని కేలరీలు తగ్గుతాయి. దీంతో ఆటోమెటిక్‌గా బరువు అయితే తగ్గుతారు. అలాగే సరైన ఫుడ్ తీసుకుంటూ రన్నింగ్ చేయాలి. లేకపోతే నీరసంగా మారతారని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఒక్కసారిగా ఎక్కువగా రన్నింగ్ చేసి అనారోగ్య సమస్యలను తెచ్చుకోవద్దు.
Read Also: టెస్ట్ మ్యాచ్‌లకు విరాట్ రిటైర్మెంట్.. కారణమిదే!
రన్నింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదే. కానీ ఒకేసారి చేయడం మంచిది కాదు. డైలీ ఒక పది నిమిషాలు అయినా కూడా రన్నింగ్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు రావు. యంగ్ లుక్‌లో ఆరోగ్యంగా ఉంటారు. రన్నింగ్ చేయడం వల్ల కండరాలు బలంగా తయారు అవుతాయి. దీంతో స్ట్రాంగ్‌గా ఉంటారు. రన్నింగ్ వల్ల కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రన్నింగ్ చేస్తే మెదడులో రిఫ్రెష్ అవుతుంది. దీంతో యాక్టివ్‌గా ఉంటారు. ప్రతీ విషయాన్ని కూడా ఎంతో బాగా ఆలోచిస్తారు. ఒత్తిడి, ఆందోళనకు గురి కాకుండా చాలా ప్రశాంతంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. డైలీ ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో ఒక పది నిమిషాలు రన్నింగ్ చేస్తే.. టెన్షన్‌లు అన్ని కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Coffee: కాఫీ ఆరోగ్యానికే కాదు.. తలకు కూడా మంచిదే!
-
Yellow: ఎల్లో కలర్ ఫేవరెట్.. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే?
-
Beauty: లైగర్ బ్యూటీ ఫిటినెస్ సీక్రెట్ ఇదే
-
Goodbye to Your Job: జాబ్‌కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా.. ఒక్క నిమిషం ఆగండి
-
Masala Soda: ఫస్ట్ టైమ్ మసాలా సోడా.. బ్రిటిష్ అమ్మాయి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూస్తే నవ్వొస్తుంది
-
Joint Problems: ఉప్పుతో ఇలా చేస్తే కీళ్ల సమస్యలన్నీ పరార్