Kannappa Song Release: కన్నప్ప నుంచి లవ్ సాంగ్ రిలీజ్.. రొమాంటిక్‌గా సాంగ్ భలే ఉందిగా!

Kannappa Song Release:
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప టీజర్ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా భక్త కన్నప్ప (Bhaktha Kannappa) జీవిత ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఇటీవల టీజర్‌ను విడుదల మూవీ టీం ఇప్పుడు తాజాగా లవ్ సాంగ్‌ను విడుదల చేసింది. కన్నప్ప మైథలాజికల్ సినిమా అయినప్పటికీ ఇందులో లవ్ సాంగ్ కూడా ఉంది. చక్కని మెలోడితో ఈ పాట బాగుంది. అయితే ఒక్కసారిగా కాకుండా కాస్త స్లోగా ఆడియెన్స్‌కు పాట నచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మూవీ టీం ఇదివరకే ఒక పాటను విడుదల చేయగా.. ఇప్పుడు రెండో పాటను కూడా విడుదల చేసింది. ఈ లవ్ సాంగ్‌కు శ్రీమణి సాహిత్యం వహించగా స్టీఫెన్ దేవస్సి ట్యూన్స్ కంపోజ్ చేశాడు. ఈ లవ్ సాంగ్‌లో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ కనిపించింది. తిన్నడు పాత్రలో విష్ణు నటిస్తుండగా.. నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ నటిస్తోంది. ఈ లవ్ సాంగ్ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చే విధంగానే ఉంది. మరి ఈ పాటకి ఆడియెన్స్ ఫిదా అవుతారో లేదో చూడాలి. ఈ సినిమాలో ముఖ్య నటీనటులు నటిస్తున్నారు. మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ తదితరులు నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా మూవీ టీం ఇటీవల కన్నప్ప టీజర్‌ను విడుదల చేసింది. టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విష్ణు నటన, పాటలు, విజువల్స్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, టీజర్లో ఉండే కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్ (Visuvals) అయితే సినిమా అంచనాలను అమాంతంగా పెంచేశాయి. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు హిట్ కాగా.. ఈ టీజర్‌తో సినిమా పీక్స్‌లో ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. మొదటి టీజర్లో అన్ని పాత్రలను కూడా పరిచయం చేయలేదు. కానీ ఈ టీజర్లో అందరి పాత్రలను కూడా మూవీ టీం విడుదల చేసింది. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) కూడా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ టీజర్‌లోని కొన్ని షాట్లు అయితే చాలా బాగున్నాయి. మూవీ టీం రెండు టీజర్లను విడుదల చేసింది. అందులో మొదటి కంటే రెండో టీజర్ బాగుంది.