Kannappa Teaser Review: వచ్చేసిన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప టీజర్.. ఈ షాట్లు మాత్రం హైలెట్

Kannappa Teaser Review:
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప టీజర్ (Kannappa Teaser) వచ్చేసింది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా భక్త కన్నప్ప (Bhaktha Kannappa) జీవిత ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా టీజర్‌ను (Teaser) మూవీ టీం విడుదల చేసింది. టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విష్ణు నటన, పాటలు, విజువల్స్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, టీజర్లో ఉండే కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్ (Visuvals) అయితే సినిమా అంచనాలను అమాంతంగా పెంచేశాయి. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు హిట్ కాగా.. ఈ టీజర్‌తో సినిమా పీక్స్‌లో ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. మొదటి టీజర్లో అన్ని పాత్రలను కూడా పరిచయం చేయలేదు. కానీ ఈ టీజర్లో అందరి పాత్రలను కూడా మూవీ టీం విడుదల చేసింది. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) కూడా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో మరపురానిదిగా ప్రేక్షకుల గుండెల్లో ఉంటుందని అంటున్నారు. సినిమా టీజర్ అయితే బాగుంది. టీజర్లో కొన్ని షాట్లు అయితే చాలా బాగున్నాయి.
అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివ పార్వతులుగా నటించారు. చివరికి ప్రభాస్ కూడా కనిపించాడు. కానీ అతని క్యారెక్టర్‌ను ఫుల్‌గా రివీల్ చేయలేదు. ఒక్క డైలాగ్ కూడా ప్రభాస్‌కు ఇవ్వలేదు. పార్వతి ప్లేస్‌లో కాజల్ అగర్వాల్ అయితే జీవించేసింది. కానీ డబ్బింగ్ సెట్ కాలేదని పలువురు అంటున్నారు. టీజర్ ఎండింగ్లో అయితే ప్రభాస్ లుక్‌తో బాగుంది. ప్రభాస్ లుక్‌తో కాస్త టీజర్‌కి హైప్ పెరిగింది. ఇందులో అన్న విజువల్స్ కూడా సూపర్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా చెప్పక్కర్లేదు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని కూడా సూపర్‌గా ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి టీజర్ కంటే రెండో టీజర్ కాస్త బాగుందనే చెప్పవచ్చు. మొదటి టీజర్‌పై కాస్త విమర్శలు వచ్చాయి. కానీ టీజర్లో సినిమాపై హైప్ పెంచే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ సినిమా టీజర్ ఎలా ఉంది? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.