Viral Video: ఏందయ్య ఇది మెట్రో స్టేషన్ లేకపోతే వాటర్ ఫాల్స్.. వైరల్ వీడియో

Viral Video: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ముంబై, తమిళనాడు, కర్ణాటకలో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. రోడ్లు, ఇళ్లు ఇలా ఎక్కడ చూసినా కూడా వర్షాలే కనిపిస్తున్నాయి. అయితే మహారాష్ట్రలోని ముంబై నగరంలో గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ముంబై మొత్తం నీటితో నిండిపోయింది. అండర్ గ్రౌండ్ ప్రాంతాలు అన్ని కూడా వాటర్ ఫాల్స్లా మారుతున్నాయి. ప్రయణికులు ఎప్పుడు ప్రయాణించే మెట్రో స్టేషన్ అయితే వర్షంతో తడిచిపోయింది. మెట్రో స్టేషన్ వాటర్ ఫాల్స్‌ను తలపించేలా చేసింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి ఆచార్య ఆత్రే చౌక్ వరకు ఉన్న మెట్రో లైన్ ఈ నెలలో ప్రారంభమైంది. దీనికి ఆక్వా లైన్ అని పేరు పెట్టారు. అయితే ఈ లైన్ మొత్తం కూడా వర్షం కారణంతో జలపాతంలా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడయోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఇంత వర్షానికి స్విమ్మింగ్ ఫూల్, వాటర్ ఫాల్స్లా మారాయి ఏంటని కామెంట్లు చేస్తున్నారు.
Read Also:iQOO Neo 10 5G : 36 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. iQOO Neo 10 5G బ్యాటరీ అదరహో..ధర ఎంతంటే?
కొత్త ఓపెన్ చేసిన స్టేషన్ కానీ స్టేషన్ పైకప్పులకు చిల్లులు పడ్డాయి. దీంతో వర్షం నీరు భారీగా స్టేషన్ల పడుతోంది. మొత్తం స్టేషన్ కూడా నీటితో నిండిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలను కొందరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ప్రారంభించిన ఈ స్టేషన్ ఇలా కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతా కూడా అన్యాయంగా కట్టారని, బాగా అవినీతి జరిగిందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు వాటర్‌ఫాల్స్ చూడాలంటే కొండల దగ్గరకు వెళ్లక్కర్లేదు. వర్షం వచ్చినప్పుడు మెట్రో స్టేషన్‌కు వెళ్తే సరిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు దీన్ని ఎవరైనా మెట్రో స్టేషన్ అంటారా? అని కామెంట్లు చేస్తున్నారు. అయితే కేవలం ముంబైలోనే కాకుండా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ సారి నైరుతి రుతుపవనాలు కేరళను ముందుగానే తాకాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Newly inaugurated Worli underground metro station of Aqua line 3 submerged in water this morning. #MumbaiRain pic.twitter.com/D0gwopOXBE
— Tejas Joshi (@tej_as_f) May 26, 2025
-
Telangana Rains: దంచికొడుతోన్న భారీ వర్షాలు.. కీలక అలర్ట్
-
Telangana Rains: తెలంగాణకు ఓ పెను హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు