Gold loan: ఆర్బీఐ కీలక నిర్ణయం.. గోల్డ్ లోన్ ఇకపై రావడం డౌటే

Gold Loan:
డబ్బులు అవసరం ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ఏం అవసరం లేదు అనుకుంటాం. కానీ ఇంతలోనే సడెన్‌గా డబ్బులు అవసరం అవుతాయి. ఇలాంటి సమయాల్లో అప్పుు అడిగినా కూడా కొందరు ఇవ్వరు. అప్పుడే చాలా మందికి లోన్ గుర్తు వస్తుంది. అర్జెంట్‌గా డబ్బులు కావాలంటే ముందుగా లోన్ తీసుకుంటారు. అందులోనూ గోల్డ్ ఎక్కువగా తీసుకుంటారు. బంగారం పెద్దగా యూజ్ చేయం. ఇంట్లోనే ఉంటుందని.. లోన్ పెడతారు. ఇలా చేయడం వల్ల డబ్బులు వస్తాయి.. కనీసం అప్పు అయినా తీరుతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే చాలామంది ఎక్కువగా గోల్డ్ లోన్ వైపు మొగ్గు చూపుతుంటారు. చాలా బ్యాంకులు కూడా గోల్డ్ లోన్ ఈజీగా ఇస్తుంటాయి. అసలు బంగారం ఎవరిదనే విషయాలపై ఆరా తీయకుండా బ్యాంకులు గోల్డ్ లోన్ ఇస్తుంటాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు గోల్డ్ లోన్ తీసుకునేవి. కానీ ఇకపై గోల్డ్ లోన్ తీసుకోవడం అంత ఈజీ కాదు. గోల్డ్ లోన్ విషయంలో ఆర్బీఐ కీలక మార్పులు చేయనుంది. మరి ఆ మార్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం.
గతంలో గోల్డ్ లోన్ తీసుకునే ఇబ్బంది ఉండేది కాదు. చాలా తొందరగా గోల్డ్ లోన్‌ను బ్యాంకులు ఇచ్చేవి. కానీ ఇప్పుడు అంత ఈజీగా ఇవ్వవు. అన్ని విషయాలను చెక్ చేసిన తర్వాతే బ్యాంకులు గోల్డ్ లోన్ ఇవ్వడానికి రెడీ అయ్యేలా ఆర్బీఐ ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ బ్యాంకులు అయితే అసలు ఈ నిబంధనలు పాటించడం లేదు. ఈ క్రమంలోనే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోనుంది. దేశ వ్యాప్తంగా ఈ విషయాలను ఆర్బీఐ పరిశీలించి ఈ నిర్ణయం తీసుకోనుంది. చాలా మంది గోల్డ్ లోన్ తీసుకునే టప్పుడు తర్వాత వాటిని కట్టకుండా వదిలేస్తున్నారు. అలాగే ఒక్కో బ్యాంకు వడ్డీ రేట్లు ఒక్కోలా ఉంటున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఒకే పాన్ కార్డుపై ఎక్కువ గోల్డ్ లోన్లు ఇస్తుంది. తర్వాత వాటిని కట్టకుండా వదిలేసినా లైట్ తీసుకుని, ఆ బంగారాన్ని వేలంకి వేస్తుంది. ఒక గోల్డ్ లోన్ కట్టకుండా మరోక లోన్ ఇస్తుంది. ఇలాంటి విషయాలను అన్నింటిని ఆర్బీఐ గమనించి ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే గోల్డ్ లోన్ ఇకపై రాదు. కొన్ని రూల్స్, నియమాలు పాటిస్తేనే వస్తుంది. బ్యాంకులు కూడా అన్ని విధాలుగా చెక్ చేసిన తర్వాతే గోల్డ్ లోన్ ఇవ్వడానికి మక్కువ చూపిస్తుంది. గోల్డ్ లోన్ ఇచ్చే ముందు బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేయనుంది. అసలు తాకట్టులో పెట్టే బంగారం వాళ్లదేనా? లేకపోతే ఇతరులదా? కట్టకుండా డబ్బులు వదిలేస్తారా? ఇలా అన్ని విషయాల్లో చెక్ చేసిన తర్వాతే లోన్ ఇచ్చేలా రూల్స్ మార్చనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బంగారం ధర పెరగడంతో పాటు గోల్డ్ లోన్‌లు తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ క్రమంలోనే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
-
Gold Loan: బంగారం లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తెలుసుకోవడం మరిచిపోవద్దు
-
BCCI: ఆ రూల్ మార్చం.. తగ్గేదేలే అంటున్న బీసీసీఐ
-
Business Loans : ఆ విషయంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువట.. అప్పులు చేసి మరీ..
-
Gold: బంగారం కొనుగోలు చేయడానికి పర్సనల్ ఇస్తారా? ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది?
-
Gold Loan: గోల్డ్ లోన్‌పై న్యూ రూల్స్.. నోటీస్ లేకుండా బంగారం వేలం వేస్తే ఏమవుతుందో మీకు తెలుసా?