Golden ATM: గోల్డెన్ ఏటీఎం.. బంగారం వేస్తే అకౌంట్లోకి డబ్బులు
మన దేశంలో ఎన్నో ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో డెబిట్ కార్డు వేస్తే డబ్బులు వస్తాయి. ఈ ప్రాసెస్ గురించి అందరికీ కూడా తెలిసిందే. కానీ ఇప్పుడు మరో కొత్త టెక్నాలజీ వస్తోంది.

Golden ATM: మన దేశంలో ఎన్నో ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో డెబిట్ కార్డు వేస్తే డబ్బులు వస్తాయి. ఈ ప్రాసెస్ గురించి అందరికీ కూడా తెలిసిందే. కానీ ఇప్పుడు మరో కొత్త టెక్నాలజీ వస్తోంది. బంగారం ఏటీఎం టెక్నాలజీ వస్తోంది. నిజానికి టెక్నాలజీ రోజుకి పెరుగుతుంది. కేవలం ఈ విషయంలోనే కాకుండా ప్రతీ దాంట్లో కూడా టెక్నాలజీ పెరిగింది. కొందరు ఈ టెక్నాలజీని మంచిగా ఉపయోగించుకుంటే.. మరికొందరు చెడుగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఓ దేశం ఏకంగా బంగారు ఏటీఎంను ప్రారంభించింది. ఇంతకీ ఏ దేశం గోల్డ్ ఏటీఎంను తీసుకొచ్చింది? ఎలా చేసిందనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
Read also: రాహు కేతువుల మార్పు.. వీరికి ఇక తిరుగే లేదు
గోల్డ్ ఏటీఎంను చైనా దేశం ఆవిష్కరించింది. చైనాలోని షాంఘై నగరంలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్లో బంగారు ఏటీఎం ప్రజలను ఆకర్షిస్తోంది. అయితే మొదట దీన్ని అందరూ చూసి ఇది సాధారణ ఏటీఎం అనే అనుకున్నారు. కానీ ఇది సాధారణ ఏటీఎం కాదు. ప్రత్యేకంగా బంగారం కోసం తయారు చేశారు. ఇది చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ దీనిలో ఫీచర్లు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే చైనా ఈ బంగారు ఏటీఎంను తీసుకొచ్చింది. ఈ ఏటీఎం వల్ల వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఏటీఎంలో మీరు బంగారు లావాదేవీలు అన్ని కూడా చేసుకోవచ్చు. మీకు డబ్బులు కావాలంటే మీ దగ్గర ఉన్న బంగారాన్ని కొనేయవచ్చు. అయితే మీకు డబ్బులు కావాలంటే ముందుగా మీ దగ్గర ఉన్న బంగారాన్ని మిషన్లో వేయాలి. ఆ తర్వాత అది 1200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కరిగిస్తుంది. ఆ తర్వాత దాని స్వచ్ఛతను కొంత టైమ్లో పరీక్షించుకుంటుంది. అయితే ఈ బంగారు ఏటీఎం షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్ రేటు ప్రకారం బంగారం విలువను లెక్కిస్తుంది. ఆ తర్వాత మొత్తం కూడా బ్యాంక్ ఖాతాలోకి వచ్చేలా చేస్తుంది.
Read Also: బంగారం లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తెలుసుకోవడం మరిచిపోవద్దు
అవసరానికి బంగారం అమ్మాలంటే ఇంతకు ముందు బంగారు షాపుకు వెళ్లాలి. కానీ ఇకపై అలాంటి ఇబ్బంది లేదు. అసలు ఎక్కడికి వెళ్లకుండా ఈ గోల్డెన్ ఏటీఎం నుంచి మీరు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ ఏటీఎం వల్ల మీరు ఎక్కడైనా కూడా బంగారం అమ్ముకోవచ్చు. అలాగే ఇది 24 గంటల పాటు రాత్రిపూట కూడా పని చేస్తుంది. అయితే అంతా పరిశీలించి ఈ బంగారాన్ని అమ్ముతారు. మీరు బంగారం అమ్మాలంటే అది స్వచ్ఛంగా ఉండాలి. అయితే ఈ గోల్డెన్ ఏటీఎం వల్ల కొనుగోలు కూడా చేయవచ్చట. అయితే ఇది చైనాలో ఉండటంతో.. ఇండియన్స్ కూడా ఇలా టెక్నాలజీ వస్తే ఎంతో బాగుంటుందని అంటున్నారు. అయితే ఇలాంటి టెక్నాలజీ వల్ల దొంగలు కూడా ఎక్కువగా ఉంటారని అంటున్నారు. ఇదే కనుక వస్తే దొంగలకు మంచి అవకాశం కల్పించనట్లే. ఇప్పటికే ఏటీఎంలను వదలడం లేదు. ఇక బంగారు ఏటీఎం వస్తే ఇంకా ఏమైనా ఉందా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ బంగారు ఏటీఎంను షెన్జెన్కు చెందిన ‘కింగ్హుడ్ గ్రూప్’ అనే కంపెనీ తయారు చేసింది. అయితే చైనాలో చాలా నగరాల్లో ఈ గోల్డెన్ ఏటీఎంను పెట్టారు.