Digital Payments: డిజిటల్ పేమెంట్స్‌లో ఇండియా సరికొత్త రికార్డు
Digital Payments సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారు. ప్రతీ చిన్న విషయానికి కూడా వీటినే వాడుతున్నారు. దీంతో యూపీఐ వాడే వారి సంఖ్య పెరిగింది.

Digital Payments: ప్రస్తుతం దేశంలో ఎక్కువ మంది డిజిటల్ పేమెంట్స్ వాడుతున్నారు. ఏ చిన్న వస్తువు కొనుగోలు చేయాలన్నా కూడా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో వీటిని వాడుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే గత నెలలో డిజిటల్ లావాదేవీలు సరికొత్త రికార్డును నెలకొల్పాయి. రికార్డు స్థాయిలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ లావాదేవీలు నమోదయ్యాయి. అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం గతేడాది జనవరి నుంచి నవంబర్ వరకు 15,547 కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. అయితే వీటి విలువ దాదాపుగా రూ. 223 లక్షల కోట్లు ఉంటుంది. 2024 డిసెంబర్ నెలలో కూడా యూపీఐ లావాదేవీలు బాగానే వచ్చాయి. ఆ నెలలో 16.73 బిలియన్ల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. అంటే రూ.23.25 లక్షల కోట్లతో ఆల్ టైమ్ రికార్డును సృష్టించాయి. గతేడాది కొనసాగిన ఊపునే గత నెల మార్చిలో కూడా యూపీఐ కొనసాగించింది. యూపీఐ లావాదేవీల సంఖ్యలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈ ఏడాది జనవరిలో యూపీఐ లావాదేవీలు 16.99 బిలియన్లకు చేరుకుంది. అంటే మొత్తం రూ.23.48 లక్షల కోట్లతో చరిత్ర సృష్టించింది. అలాగే మార్చిలో కూడా ఎక్కువ లావాదేవీలు జరిగాయి.
సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారు. ప్రతీ చిన్న విషయానికి కూడా వీటినే వాడుతున్నారు. దీంతో యూపీఐ వాడే వారి సంఖ్య పెరిగింది. అయితే 2024లో మొత్తం 172 బిలియన్ లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. 2023తో పోలిస్తే 46% వృద్ధిని సాధించింది. అయితే 2023లో ఇది విలువ పరంగా రూ.247 లక్షల కోట్లతో 35% పెరుగుదలను నమోదు చేసింది. అయితే ఈ యూపీఐ లావాదేవీల్లో ఎక్కువగా వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు, కిరాణా దుకాణాలు, షాపులు ఇలాంటి వారే ఎక్కువ మంది ఉన్నారు. వీరు వ్యాపారం కోసం ఎక్కువగా యూపీఐ వాడుతున్నారు. అయితే అంతర్జాతీయంగా మొత్తం ఏడు దేశాల్లో యూపీఐ అందుబాటులోకి వచ్చింది.
యూపీఐ ద్వారా కేవలం మంచి మాత్రమే కాదు.. నష్టాలు కూడా జరిగాయి. గతంతో చూసుకుంటే ప్రస్తుతం చాలా మంది యూపీఐ వాడుతున్నారు. దీనివల్ల సైబర్ మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అప్పటి కంటే ప్రస్తుతం 50 శాతం వరకు సైబర్ మోసాలు బాగా పెరిగాయి. యూపీఐ వల్ల వీటి బారిన పడిన వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. అయితే ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. నేటి నుంచి ఇతరులకు కేటాయించిన మొబైల్ నంబర్లు, ఇన్ యాక్టివ్ ఉన్న మొబైల్ నంబర్లకు ఉన్న యూపీఐ సేవలు నిలిచిపోతాయి. ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూపీఐ లైట్ వ్యాలెట్‌లో లోడ్ చేసిన అన్నింటిని కూడా మళ్లీ బ్యాంక్ అకౌంట్‌కు పంపించే ఆప్షన్ ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది. ఇకపై యూపీఐ లైట్ వాడాలన్నా కూడా యాప్ పిన్, పాస్‌కోడ్, బయోమెట్రిక్ వంటివి తప్పకుండా వినియోగించాలి.