Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Business News »
  • Vodafone Idea 5g Services Launched In Mumbai

Vodafone: VI 5జీ వచ్చేసింది.. 100 నగరాలకు విస్తరణ!

Vodafone: VI 5జీ వచ్చేసింది.. 100 నగరాలకు విస్తరణ!
  • Edited By: kusuma,
  • Updated on March 21, 2025 / 04:41 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Vodafone: ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్టెల్ ఇప్పటికే 5జి నెట్వర్క్ లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ రేసులో వొడాఫోన్ ఐడియా (VI) చాలా వెనుకబడి ఉంది. 4జీ నెట్‌వర్క్‌తోనేే ఇంకా కొనసాగుతోంది. అయితే ఇప్పుడిప్పుడే వీఐ ముందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తన వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు 5జీ నెట్వర్క్ ను లాంచ్ చేసింది. ఈనెల ముంబైలో రెండో వారంలో ట్రైల్ స్టార్ట్ చేసింది.

ఇందులో భాగంగానే అక్కడ పూర్తిస్థాయిలో 5G నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు వచ్చే నెల అంటే ఏప్రిల్ నుంచి ఢిల్లీ, బెంగళూరు, పాట్నా, మైసూర్, చండీగఢ్, వంటి ప్రాంతాల్లో తమ 5జి నెట్వర్క్ ను లాంచ్ చేస్తామని వోడాఫోన్ ఐడియా కంపెనీ తెలిపింది. దీంతోపాటు త్వరలో మహారాష్ట్ర, చెన్నై, కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో 5G నెట్వర్క్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే 5జి నెట్వర్క్ విభాగంలో అందుబాటులోకి వచ్చిన జియో, ఎయిర్టెల్ కంపెనీలకు ఇది పోటీగా నిలవనుంది. అయితే ఇప్పుడు 5జి నెట్వర్క్ పెట్టడం వల్ల తమ యూజర్లు ఇతర నెట్వర్క్ లకు పోర్ట్ అయ్యే సంఖ్య తగ్గుతుందని వీఐ భావిస్తోంది. కాగా వచ్చే మూడేళ్లలో 17 టెలికం సర్కిల్స్ లోని 100 నగరాలకు తమ 5జి నెట్వర్క్ ను విస్తరిస్తామని కంపెనీ చెప్తోంది. ఇదిలా ఉంటే విఐ తన 5జి నెట్వర్క్ ను ప్రారంభించడంతో.. తన రీఛార్జ్ ప్లాన్ లపై ఆఫర్లు ప్రకటించింది.

ప్రారంభ ఆఫర్లలో భాగంగా.. కేవలం 299 రూపాయలకే 5జి అన్లిమిటెడ్ డేటా అందిస్తోంది. ఈ ధరతో రీఛార్జ్ చేసుకున్న వోడాఫోన్ ఐడియా యూజర్లు 5జి అన్లిమిటెడ్ డేటాను పొందుతారు. దీని బట్టి చూస్తే ఇతర టెలికాం సంస్థల కంటే ఇది బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అనే చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్ లో యూజర్లు అన్లిమిటెడ్ కాల్స్ ప్రయోజనం పొందుతారు. అలాగే 100 ఎస్ఎంఎస్లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 1gb 4జి డేటాతో పాటు 5జి డేటాను యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు.

Tag

  • 5g
  • cities
  • Mumbai
  • Vodafone
Related News
  • Allu Arjun-Atlee Movie Shooting: అల్లు అర్జున్-అట్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే మూవీ షూటింగ్‌!

  • HPCL: భారీగా ఉద్యోగాలు.. ఒక్కోసారి జాబ్ వస్తే లైఫ్ సెట్

  •  Samantha : వామ్మో.. ఫోటోగ్రాఫర్ల పై విరుచుకుపడ్డ సమంత.. ఇంత కోపం ఎన్నడూ చూడలేదు

  • Flight Journey: విమాన ప్రయాణం.. భయం భయం..

  • Viral Video : తాగింది దిగేలా చేయాలి ఇలాంటి వాళ్లకు.. మహిళా కోచ్ లో ప్యాంట్ జిప్ తిసే ప్రయత్నం.. వీడియో వైరల్

  • Apple : ముంబైలో యాపిల్ కొత్త స్టోర్ – బెంగళూరులోనూ ప్లాన్.. అద్దె ఎంతో తెలిస్తే గుండె దడేల్ అనాల్సిందే

Latest Photo Gallery
  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us