Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.60 వేలకు పైగా జీతం
Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా మంది కష్టపడుతుంటారు. వీటి కోసం ఎంతో కష్టపడుతుంటారు. చాలా మంది పదో తరగతితో చదువు ఆపేస్తారు. ఆర్థిక సమస్యలు,

Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా మంది కష్టపడుతుంటారు. వీటి కోసం ఎంతో కష్టపడుతుంటారు. చాలా మంది పదో తరగతితో చదువు ఆపేస్తారు. ఆర్థిక సమస్యలు, కొన్ని వ్యక్తిగత కారణాలు వల్ల చాలా మంది పదో తరగతితో చదువు ఆపేస్తారు. ఇలాంటి వారు కూడా పదో తరగతి అర్హతతో ఉన్న ఉద్యోగాల కోసం ఎక్కువగా ట్రై చేస్తుంటారు. అలాంటి వారికే ఈ ఉద్యోగాలు. పదో తరగతి పూర్తి చేసి అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP)లో ఉద్యోగాలకు పదో తరగతి అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అయితే కేవలం పదో తరగతి పాస్ అయితేనే కాదు.. స్పోర్ట్స్ ఆడే వారి కోసం కూడా ఇది బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్-సి పోస్టుల భర్తీకి ఐటీబీపీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 133 పోస్టులను ఐటీబీపీ భర్తీ చేయనుంది. అయితే ఈ పోస్టులకు పురుషులు, మహిళలు ఇద్దరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న వారంతా కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఉద్యగాలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి తప్పకుండా పదో తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే వయస్సు కనీసం 18 సంవత్సరాలు అయి ఉండాలి. గరిష్టంగా 23 సంవత్సరాలు ఉంటేనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు. లేకపోతే మీరు అప్లై చేసుకోవడానికి అనర్హులు. అయితే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో కాస్త సడలింపు ఉంటుంది. అయితే స్పోర్స్ కోటాలో ఉన్నవారికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అభ్యర్థులు దీనికి అర్హులు.
స్పోర్ట్స్ ట్రయల్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అయితే ఈ ఉద్యోగాలకు ఎంపికైనా అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య జీతం ఇస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://recruitment.itbpolice.nic.inలోకి వెళ్లి అప్లై చేసుకోండి. అయితే వీటికి అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 2వ తేదీ చివరి తేదీ. అయితే స్పో్ర్ట్స్ విభాగంలో వెయిట్‌లిఫ్టింగ్, సైక్లింగ్, టైక్వాండో, యోగాసన, పెన్కాక్ సిలాట్, ఆర్చరి, బాస్కెట్‌బాల్, ఫుడ్‌బాల్, కాయాకింగ్, గుర్రపు స్వారీ, అథ్లెటిక్, స్విమ్మింగ్, షూటింగ్, బాక్సింగ్, రోయింగ్, వాలీబాల్, జూడో, రెజ్లింగ్, జిమ్నాస్టిక్స్, కబడ్డి, ఐస్ హాకీ, హాకీ, హ్యాండ్‌బాల్, ఐస్ స్కీయింగ్, పవర్ లిఫ్టింగ్, ఖోఖో వంటి వాటిలో పతాకాలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.