Airtel: ఫ్రీగా వీటిని యూజ్ చేయవచ్చు.. ఎయిర్‌టెల్ కస్టమర్లు ఇది మీకోసమే

Airtel:
ప్రస్తుతం అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ లేదా కీప్యాడ్ ఇలా ఏదో ఒక మొబైల్ వాడుతూనే ఉంటారు. ఇతరులతో మాట్లాడటానికి, అవసరాలకు తప్పకుండా మొబైల్ ఉపయోగిస్తున్నారు. అయితే ఒక్కోక్కరు ఒక్కో నెట్‌వర్క్ సిమ్‌ను వాడుతుంటారు. దేశంలో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కి కూడా వినియోగదారులు ఎక్కువ మందే ఉన్నారు. జియో వచ్చిన తర్వాత ఎయిర్‌టెల్‌కి కాస్త డిమాండ్ తగ్గిందనే చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ కూడా కొందరు ఎయిర్‌టెల్ వైఫై వంటివి వాడుతున్నారు. వీరికి ఎయిర్‌టెల్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవల ఎయిర్‌టెల్ యాపిల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కేవలం ఎయిర్‌టెల్ వినియోగదారులు రెండు సేవలను ఉపయోగించుకోవచ్చు. యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ మ్యూజిక్ సేవలను ఎయిర్‌టెల్ వినియోగదారులు అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది కేవలం ఎయిర్‌టెల్ హోమ్ వై-ఫై కస్టమర్లు, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు మాత్రమే. అది కూడా రూ.999 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యే ప్లాన్స్ అందరూ కూడా యాపిల్ టీవీ ప్లస్ కంటెంట్‌ను పొందుతారు. వీటిని ఎప్పుడైనా కూడా చూడవచ్చని తెలిపింది.
ఎయిర్‌టెల్ ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఇలాంటి ఒప్పందాన్నే కుదుర్చుకుంది. అప్పుడు ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ మ్యూజిక్ కంటెంట్‌ను అందించింది. అయితే ఇప్పుడు ఈ సదుపాయం అనేది ఎయిర్‌టెల్ వైఫై, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు మాత్రమే వినియోగించుకోవాలి. రూ.999 నుంచి ప్రారంభయ్యే ప్లాన్స్‌పై యాపిల్ టీవీతో పాటు యాపిల్ మ్యూజిక్‌ను కూడా పొందుతారు. వీటికి ఫ్రీగా యాక్సెస్ పొందాలంటే రూ.999, రూ.1099, రూ.1599, రూ.3999 వైఫై ప్లాన్స్ కూడా కొనుగోలు చేసుకోవచ్చు. వీటవల్ల మీరు అన్నింటిని కూడా ఈజీగా ఉపయోగించవచ్చు. తక్కువ ఖర్చుతో మీరు అన్నింటిని కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. అయితే వీటిని కొనుగోలు చేస్తే యాపిల్ టీవీలో వచ్చే అన్ని సిరీస్‌లు, సినిమాలు కూడా వస్తాయి. అలాగే చూస్తు్న్నప్పుడు ఎలాంటి ప్రకటనలు కూడా కనిపించవు. దీంతో మీరు ఈజీగా అన్ని సేవలను వాడవచ్చు. యాపిల్ మ్యూజిక్ అవి వాడాలంటే తప్పకుండా యాపిల్ ఫోన్, లాగిన్స్ ఉండాలి. అదే దీని ద్వారా అయితే మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాపిల్ టీవీ, మ్యూజిక్‌ను హ్యాపీగా వాడుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు.. మీరు ప్లాన్స్ కొనుగోలు చేసి వీటిని హ్యాపీగా యూజ్ చేసుకోండి.