Ananya Nagalla: బాలీవుడ్‌లోకి అనన్య నాగళ్ల ఎంట్రీ.. ఏకంగా లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఛాన్స్
Ananya Nagalla అనన్య నాగళ్ల ఓ లేడీ ఓరియెంటేడ్ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. రాకేష్ జగ్గి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి ఇమ్మత్ లడుమోర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Ananya Nagalla: పవన్ కళ్యాణ్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి సినీ బ్యా్క్‌గ్రౌండ్ లేకపోయినా కూడా సినీ ఇండస్ట్రీలో రాణిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసి సినిమాల కోసం వదిలేసింది. షాదీ అనే షార్ట్ ఫిల్మ్‌తో అనన్య ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మల్లేశం సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో అనన్య డీ గ్లామర్ లుక్‌ల అదిరిపోయింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మంచి ఆఫర్లతో బిజీ బిజీగా ఉంటుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. అయితే మల్లేశం సినిమాలో అనన్య నటనకు మంచి గుర్తింపు లభించింది. దీంతో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్‌సాబ్ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ సినిమాలో అనన్య నాగళ్ల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత కూడా అనన్యకు మంచి ఆఫర్లు వచ్చాయి. అయితే ఈ తెలుగమ్మాయి చేతిలో మరో క్రేజీ ఆఫర్ ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో కాకుండా ఏకంగా బాలీవుడ్‌కే ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.
అనన్య నాగళ్ల ఓ లేడీ ఓరియెంటేడ్ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. రాకేష్ జగ్గి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి ఇమ్మత్ లడుమోర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అనన్య ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ట్రైబల్ అమ్మాయిగా అలరించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యిందని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌లో అనన్య రాణించడానికి ఈ సినిమా బెస్ట్‌గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అనన్య కెరీర్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఈ సినిమాతో అనన్య సినీ ఇండస్ట్రీలో ఇంకో మెట్టు ఎక్కడానికి బాగా ఉపయోగపడుతుందట. మరి ఈ సినిమా గురించి అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. మూవీ టీం లేదా అనన్య ఇంకా ఈ సినిమా గురించి స్పందిస్తేనే ఓ క్లారిటీ వస్తుంది.
అనన్య నాగళ్ల తన కెరీర్‌లో ఎన్నో బెస్ట్ సినిమాల్లో నటించింది. ఒకే జోనర్‌లోని సినిమాలు కాకుండా డిఫరెంట్ జోనర్‌లో ఉండే సినిమాల్లో నటించింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించింది. స్టోరీలను బాగా సెలక్ట్ చేసుకునేది. ఎలాంటి స్టోరీలో అయితే నటనకు స్కోప్ ఉంటుందో అలాంటి వాటినే అనన్య నాగళ్ల ఎంచుకుంది. సినిమా చిన్నదైనా కూడా మంచి కంటెంట్ ఉంటే చేస్తోంది. నటనకు మంచి స్కోప్ ఉండే సినిమాలకే ఒకే చెప్పింది. ఇలా పొట్టేల్ వంటి సినిమాల్లో నటించింది. వీటిలో తన నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. మరి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.
-
Malayalam Movies: నానికి నచ్చిన మలయాళ మూవీస్ ఏంటో మీకు తెలుసా?
-
Court Movie : ఓటీటీలో కోర్ట్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
-
Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల
-
Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..
-
Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్
-
Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..