Anil ravipudi: అనిల్ రావిపూడి డ్రీమ్ ప్రాజెక్ట్ అదేనా? రాజమౌళి బాటలోనే నడుస్తున్నాడా?

Anil Ravipudi:
దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు సినీ ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇతని గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి సినిమాలతో టాలీవుడ్‌ను పైకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అసలు రాజమౌళి కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ మూవీ కూడా లేదు. తీసిన ప్రతీ సినిమా కూడా హిట్‌గానే నిలిచింది. రాజమౌళికి ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. మహా భారతం డ్రాప్ మీద ఓ సినిమా తీయాలని ఎప్పటి నుంచో కోరిక ఉందని ఇది వరకే చాలా సార్లు రాజమౌళి చెప్పన విషయం తెలిసిందే. అయితే రాజమౌళి బాటలో మరో యంగ్ డైరెక్టర్ కూడా నడుస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనిల్ రావిపూడి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే రాజమౌళిలాగా తనకి కూడా మహా భారతం డ్రాప్‌లో ఓ మూవీ చేయాలని ఉందని, ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపాడు. మహా భారతం బ్యాక్ డ్రాప్‌లో ఒక మైథలాజికల్ సినిమా చేస్తానని, కానీ ఎవరితో చేస్తాననే విషయం తెలియదని అనిల్ రావిపూడి తెలిపాడు.
ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అనిల్ రావిపూడి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్‌తో తీసిన ఈ సినిమా సంక్రాంతికి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమా మంచి హిట్ సాధించడంతో ఒక్కసారిగా అనిల్ రావిపూడి క్రేజ్ పెరిగిపోయింది. తర్వాత సినిమా మెగాస్టార్‌తో చేయబోతున్నట్లు కూడా ప్రకటించాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కేవలం ప్రాంతీయ భాషల్లో రిలీజ్ అయ్యి.. రూ.300 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం అనిల్ రావిపూడికి ఫుల్ డిమాండ్ ఉంది. ఏడాదికి ఒక సినిమా తీసుకుంటూ హిట్ మీద దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఒక్క ఫ్లాప్ కూడా లేదు. వరుస హిట్‌లతో రాజమౌళి వంటి దిగ్గజ డైరెక్టర్ల సరసన చేరాడు. అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ కూడా ప్రస్తుతం భారీగానే ఉంది. దాదాపుగా రూ.20 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి మొత్తం 8 సినిమాలు చేశాడు. ఈ సినిమాలు అన్ని కూడా హిట్ సాధించాయి. మంచి హిట్ టాక్ పొందడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టాయి.
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
SSMB29: మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. SSMB29 రెండు పార్ట్‌లు కాదు!
-
Rajamouli and Mahesh babu : SSMB 29 మూవీ నటీనటులను భయపెడుతున్న రాజమౌళి కొత్త రూల్…
-
Rajamouli : రాజమౌళి మాతో ఒక్క సినిమా చేయి అంటూ బతిమిలాడుకున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?
-
SSMB29 లీక్ బజ్ క్రియేషన్ కోసం మూవీ టీం కావాలనే చేసిందా? ఇందులో నిజమెంత?
-
Rajamouli-Srinivasarao: 30 ఏళ్ల కిందట అసలు రాజమౌళి జీవితంలో ఏం జరిగింది.. బయటపడ్డ నిజాలు