Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Donald Trump Imposes Huge Tariffs On Films From Other Countries

Donald Trump : సినిమాలపై ట్రంప్ భారీ టారిఫ్.. ఇకపై రిలీజ్‌లు కష్టమే

Donald Trump: అమెరికాలో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కూలిపోతుంది. ఈ క్రమంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా దేశంలోనే సినిమాలను ప్రొడ్యూజ్ చేసే వాటికి సపోర్ట్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఇలా సుంకాలు విధిస్తున్నారు.

Donald Trump : సినిమాలపై ట్రంప్ భారీ టారిఫ్.. ఇకపై రిలీజ్‌లు కష్టమే
  • Edited By: kusuma,
  • Updated on May 5, 2025 / 05:28 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. మొదటిగా వీసా ప్రక్రియలో మార్పులు చేయగా.. ఆ తర్వాత టారిఫ్‌లు విధించారు. అయితే ఇప్పుడు ఆ టారిఫ్‌లు సినిమాలపై కూడా విధించారు. ట్రంప్ టారిఫ్‌ల వల్ల ప్రపంచ దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అమెరికాకు ఎగుమతి చేస్తున్న దేశాలపై ఎక్కువగా సుంకాలు విధించింది. చైనా మినహా మిగతా దేశాలకు మొత్తం 90 రోజుల పాటు టారిఫ్‌లను ఆపారు. అయితే ఈ సుంకాల విషయంలో ట్రంప్ ఇప్పుడు సినిమా రంగంపై వేశారు. సినిమాలపై ట్రంప్ భారీ టారిఫ్‌ను విధిస్తున్నట్లు తెలిపారు. ఇతర దేశాల్లో నిర్మించిన మూవీస్ అమెరికాలో విడుదల అవుతాయి. అయితే సినిమాలపై 100 శాతం టారిఫ్ విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. అయితే అమెరికాలో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కూలిపోతుంది. ఈ క్రమంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా దేశంలోనే సినిమాలను ప్రొడ్యూజ్ చేసే వాటికి సపోర్ట్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఇలా సుంకాలు విధిస్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. అమెరికాలో సినీ ఇండస్ట్రీ తొందరగా నాశనం అవుతోంది. అమెరికా నుంచి స్టూడియోలను, ఫిల్మ్ మేకర్లను ఆకర్షించేందుకు ఇతర దేశాలు రాయితీలను ఇస్తున్నామని తెలిపారు. హాలీవుడ్‌తో పాటు అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు అసలు బాగలేవు. అయితే ఇదంతా కూడా వేరే దేశాల పని. ఇది జాతీయ భద్రతకు ముప్పుగా ఉంది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో ప్రొడ్యూజ్ అయి తమ దేశంలో విడుదలయ్యే సినిమాలకు 100 శాతం టారిఫ్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విదేశాల్లో ప్రొడ్యూజ్ అయ్యే మన దేశానికి వచ్చే అన్ని సినిమాలపై 100 శాతం టారిఫ్ విధించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ ప్రతినిధులను ఆదేశించారు. కేవలం అమెరికాలో మాత్రమే సినిమా రూపొందడం తమకు కావాలని తెలిపారు.

ప్రస్తుతం తెలుగు సినిమాలు అమెరికాలో మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. చిన్న సినిమాల కంటే స్టార్ హీరోల సినిమాలకు అమెరికాలో మంచి మార్కెట్ ఉంది. నిజం చెప్పాలంటే ఓవర్సీస్ వసూళ్లలో అమెరికానే టాలీవుడ్‌కు కీలకంగా ఉంది. అయితే అమెరికాలో టాలీవుడ్ చిత్రాలపై 100 శాతం టారిఫ్ మాత్రం పడితే టికెట్ ధరలు కూడా భారీగా పెరుగుతాయి. ఇదే కనుక జరిగితే సినిమాలు చూసే ప్రేక్షకులు కూడా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో లాభాలు కూడా భారీగా తగ్గుతాయి. కేవలం టాలీవుడ్ అనే కాకుండా ఇండియన్ మూవీస్‌పై కూడా ఈ ప్రభావం పడుతుంది. అయితే ఈ టారిఫ్‌లు సినిమాలపై ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే విషయం ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ వస్తే మాత్రం సినిమాలపై భారీ ప్రభావం తప్పకుండా పడుతుంది.

Tag

  • Donald Trump
  • Telugu Films USA
  • Telugu Movies Ban
  • Trump Shocking Decision
Related News
  • Donald Trump: బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్

  • Trump Mobile : ఐఫోన్ 17కు పోటీగా ట్రంప్ మొబైల్.. భారత మార్కెట్‌లోకి వస్తుందా? రేటు ఎంతంటే ?

  • Israel-Iran War: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ వార్‌.. అమెరికా రంగంలోకి దిగుతుందా?

  • Gold Price : ట్రంప్ దెబ్బకు పెరిగిన బంగారం.. మళ్లీ రూ.లక్షకు చేరువలో గోల్డ్!

  • Call from America: అమెరికా నుంచి పిలుపు.. వెళ్లడానికి మొగ్గు చూపని విద్యార్థులు

  • Donald Trump  : వీటిని ఎల్లప్పుడూ కూడా క్యారీ చేయాల్సిందే.. ట్రంప్ న్యూ రూల్

Latest Photo Gallery
  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us