Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Og Pawan Kalyan Movie Arjun Das And Pavan Hands Injured Shooting

OG: ఓజీలో అర్జున్ దాస్.. పవన్ చేతులకు రక్తం.. ఆందోళనలో ఫ్యాన్స్

OG: ఓజీలో అర్జున్ దాస్.. పవన్ చేతులకు రక్తం.. ఆందోళనలో ఫ్యాన్స్
  • Edited By: kusuma,
  • Updated on June 7, 2025 / 12:34 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఓజీ’ (OG) మూవీ షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీలో అర్జున్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అర్జున్ దాస్ షేర్ చేసిన ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ అర్జున్ దాస్‌ను చాలా ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. అర్జున్ దాస్ చాలా ఎమోషనల్ అవుతూ ట్వీట్ కూడా చేశారు. ఇది నాకు లభించిన గౌరవం. మీతో పని చేస్తోన్న ప్రతీ రోజునీ నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. మనం ఎప్పుడు షూటింగ్‌లో కలిసినా నా కోసం ప్రత్యేకంగా టైం కేటాయించి నాతో కూర్చుని మాట్లాడుతుంటారు. ఇవి నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. చాలా థాంక్స్ సార్. నేను మళ్లీ మీతో కలిసి పని చేయాలని ఉంది సార్ అని అర్జున్ దాస్ ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ఫొటోలో పవన్ చేతులకు రక్తం ఉంది. షూటింగ్‌లో చేతికి గాయం తగిలి ఉండటం వల్ల రక్తం వచ్చి ఉంటుందని అంటున్నారు. పవన్ చేతులకు రక్తాన్ని చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలు పవన్‌కు ఏమైందని అంటున్నారు. ఇదంతా షూటింగ్‌లో జరిగిన గాయం అని తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Kitchen AC : చల్లగా వంట చేద్దామని కిచెన్లో ఏసీ పెట్టిస్తున్నారా.. అదెంత డేంజరో తెలుసా ?

ఇదిలా ఉండగా ‘ఓజీ’ సినిమాలో అర్జున్ దాస్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కూడా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తోనే రిలీజ్ అయ్యింది. ఆయన పవర్ ఫుల్ బేస్ వాయిస్‌లో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తో ప్రియాంక అరుల్ మోహన్ రొమాన్స్ చేయనుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముంబయి మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఒక క్రైమ్ థ్రిల్లర్‌గా తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతనితో పాటు శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ వంటి నటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్, గ్లింప్స్ వంటివి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచి సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఓజీ మూవీ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందని పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Tag

  • Arjun Das
  • Movie Latest Telugu news
  • Movie news
  • OG
  • Pawan Kalyan Movie
Related News
  • Allu Arjun Atlee Movie Updates: డ్యూయల్ రోల్‌లో.. అది కూడా నెగిటివ్ క్యారెక్టర్‌లో బన్ని

  • Pawan Kalyan shocking look in OG: ఓజీ లో పవన్ కళ్యాణ్ షాకింగ్ లుక్.. లీక్డ్ వీడియో వైరల్

  • Allu Arjun Pushpa: రూ.1800 కోట్ల సినిమా.. పుష్పలో షెకావత్ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఫహాద్ ఫాసిల్ కాదా !

  • Pawan Kalyan son Mark Shankar: ప్రమాదం నుంచి బయటపడిన పవన్ కుమారుడు మార్క్ శంకర్.. ప్రస్తుతం ఎలా ఉన్నాడంటే?

  • Big shock for Kannappa movie team: కన్నప్ప మూవీ టీంకు బిగ్ షాక్.. హార్డ్ వేర్ డ్రైవ్‌తో పరార్

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓజీ కి ఆ సూపర్ హిట్ సినిమాకి మధ్య సంబంధం ఉందా..?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us