Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ స్టోరీ లీక్..ఆ సూపర్ హిట్ సినిమాకి కాపీనా?

Spirit Movie:
రెబల్ స్టార్ ప్రభాస్(Rebel star Prabhas), సందీప్ వంగ(Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో తెరకెక్కబోయే ‘స్పిరిట్'(Spirit Movie) చిత్రం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో, ట్రేడ్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుండి మొదలు అవుతుందో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అంచనాలు మాత్రం ఆకాశాన్ని అంటాయి. ‘యానిమల్’ లో సందీప్ వంగ టాలెంట్ చూసిన తర్వాత ఎవరైనా ప్రతీ హీరో అభిమాని, తమ అభిమాన హీరోతో సందీప్ ఒక్క సినిమా చేస్తే చాలు అని అనుకోని ఉంటారు. అ అదృష్టం ముందుగా ప్రభాస్ ఫ్యాన్స్ కి దక్కింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కథ మొత్తం చూస్తే మనకి తమిళం లో విడుదలైన ఒక సూపర్ హిట్ సినిమా గుర్తుకొస్తుంది.
ఇంతకీ కథ ఏమిటంటే ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు పోలీస్ ఆఫీసర్ అవుతాడు. నిజాయితీకి మారుపేరు లాంటి ఆ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కి ఒక భార్య, నాలుగేళ్ల కొడుకు ఉంటాడు. అయితే హీరో కి అతి ముఖ్యమైన సీక్రెట్ ఆపరేషన్ ని అప్ప చెప్తారు. దూకుడు స్వభావం ఉన్న హీరో , ఈ ఆపరేషన్ కారణంగా తన కుటుంబాన్ని మొత్తం రిస్క్ లో పెట్టేస్తాడు. ఇక ఆ తర్వాత ఆయన తనకి ఇచ్చిన అతి ముఖ్యమైన ఆపరేషన్ ద్వారా విలన్స్ ని ఓడించి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేదే స్టోరీ. ప్రభాస్ ఈ చిత్రం చాలా పవర్ ఫుల్ గా సీరియస్ గా కనిపించబోతున్నాడు. తన కెరీర్ మొత్తం మీద ప్రభాస్ సినిమా ప్రారంభం నుండి చివరి వరకు సీరియస్ గా ఉన్నది ఒక్క ‘ఛత్రపతి’ సినిమాలో మాత్రమే. మళ్ళీ ఇన్నాళ్లకు ‘స్పిరిట్’ లో ఆ తరహా ప్రభాస్ ని చూడబోతున్నాం అన్నమాట.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా స్టోరీ ని చూసిన తర్వాత తమిళం లో అప్పట్లో విజయ్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తేరి’ చిత్రం గుర్తుకొస్తుంది కదూ. ఇదే సినిమాని హిందీ లో ‘బేబీ జాన్’ గా రీమేక్ చేసారు. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ఈ సినిమా, హిందీ లో డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ‘స్పిరిట్’ చిత్రం కూడా అదే లైన్ మీద ఉండడంతో అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెప్తున్న మాట. స్క్రీన్ ప్లే ఎలా ఉంది అనేదే ముఖ్యం కానీ, స్టోరీ లైన్ తో పనేమీ ఉంది?, ‘యానిమల్’ చిత్రంలో స్టోరీ ఏముంది?, తండ్రి కోసం ఎంత దూరమైనా వెళ్లే కొడుకు కథలు ఇంతకు ముందు రాలేదా?, ఇది కూడా అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.