Deepika Padukone : ఆమె డిమాండ్లలో తప్పేలేదు.. దీపిక పదుకొణేకు మద్దతు పలికిన అజయ్ దేవ్ గన్

Deepika Padukone : సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాలో మొదట హీరోయిన్‌గా దీపికా పదుకొణే నటించాల్సింది. అయితే, ఇప్పుడు ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీని తీసుకున్నారు. దీనికి కారణం దీపికా కొన్ని షరతులు పెట్టడమేనని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఆమె రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని కండీషన్ పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో నటుడు అజయ్ దేవగన్ దీపికాకు మద్దతుగా నిలిచారు.
8 గంటల షిఫ్ట్ డిమాండ్
మే 29న (నేటి)న అజయ్ దేవగన్ తన భార్య, నటి కాజోల్ రాబోయే చిత్రం ‘మా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దీపికా పేరు ప్రస్తావించకుండానే ఆమెకు మద్దతు పలికారు. దీపికా పదుకొణే సందీప్ రెడ్డి వంగా ముందు పెట్టిన కండీషన్లలో ఒకటి రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని ఉండడం. ఆమె కుమార్తెకు ఇప్పుడు కేవలం 8 నెలలు కావడంతో ఈ షరతు పెట్టిందని వార్తలు వచ్చాయి.
Read Also:Viral Video : నడుస్తున్న రైలుపై పరుగులు పెట్టిన యువతి.. ఈ షాకింగ్ స్టంట్ ఎందుకంటే ?
‘మా’ ఈవెంట్‌లో కాజోల్‌ను, “మీరు ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమాలో నటించినప్పుడు మీ కుమార్తె నీసాకు కేవలం ఏడాది మాత్రమే. ఇప్పుడు తల్లులైన హీరోయిన్లు 8 గంటల షిఫ్ట్ డిమాండ్ చేస్తున్నారు కదా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగినప్పుడు, ఈ ప్రశ్నకు అజయ్ దేవగన్ ముందుకు వచ్చి సమాధానం చెప్పారు.
అజయ్ మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరూ దీన్ని అనవసరమైన డిమాండ్‌గా భావించరు. ఏ తెలివైన ఫిల్మ్‌మేకర్ కూడా అలా అనుకోరు. హీరోయిన్లు మాత్రమే కాదు, హీరోలు కూడా 8 గంటల షిఫ్ట్‌లో పని చేస్తారు” అని స్పష్టం చేశారు. దీని ద్వారా దీపికా డిమాండ్‌లో తప్పు లేదని, అది ఒక నేచురల్ డిమాండ్ అని అజయ్ పరోక్షంగా చెప్పకనే చెప్పారు.
Read Also:Phone Security : పిన్, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్.. మీ ఫోన్‌కు ఏది ఎక్కువ సేఫ్?
దీపికా పదుకొణే డిమాండ్ చేసిన ఇతర కండీషన్లు
నివేదికల ప్రకారం, 8 గంటల షిఫ్ట్ డిమాండ్‌తో పాటు, దీపికా పదుకొణే ‘స్పిరిట్’ సినిమా కోసం రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా, ఆమె ఫీజుతో పాటు సినిమా లాభాల్లో కూడా వాటా అడిగారని ప్రచారం జరిగింది. దీపికా ఈ డిమాండ్లతో విసిగిపోయిన సందీప్ రెడ్డి వంగా ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీని సెలక్ట్ చేసుకున్నారని వార్తలు సూచిస్తున్నాయి.
-
Spirit Movie: ఏకంగా ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసిన లక్కీ గర్ల్ త్రిప్తి డిమ్రీ
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్‌డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
MS Dhoni and Sandeep Reddy Vanga : ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటిస్తున్న ధోని… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్…
-
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ ఒక్క యాడ్ ఫిల్మ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా..?
-
Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ స్టోరీ లీక్..ఆ సూపర్ హిట్ సినిమాకి కాపీనా?