Pakistan: అంతర్జాతీయ మీడియా పరువు తీసుకున్న పాక్.. వీడియో వైరల్

Pakistan: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పహల్గాంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి జరిగేలా అర్థరాత్రి సమయంలో ఆపరేషన్ సింధూర్‌త భారత్ వైమానిక దాడులతో పాక్‌పై విరుచుకుపడింది. కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. ఈ ప్రతీకార దాడుల్లో పాక్ ఉగ్రవాదులు దాదాపుగా 90 మంది మృతి చెందినట్లు సమాచారం. ఉగ్రదాడితో కోపంగా ఉన్న భారత్ ఎలాంటి చప్పుడు లేకుండా వైమానిక దాడులు నిర్వహించింది. భారత్ అంతా నిద్రపోతున్న సమయంలో ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. అయితే ఈ ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ భారత్‌కి చెందిన రాఫెల్‌తో పాటు మరో ఐదు ఫైటర్ జెట్లను కూల్చేసినట్లు పాక్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయని పాక్ ఓ మీడియా ఛానెల్‌తో తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్‌ను ప్రశ్నించారు. దీంతో పాక్ డిఫెన్స్ మినిస్టర్ సమాధానం ఇచ్చి అంతర్జాతీయ మీడియా ముందు నవ్వుల పాలు అయ్యారు. ఫైటర్ జెట్లు కూల్చినట్లు పాక్ మీడియాలో కాదు.. ఇండియా సోషల్ మీడియాలో వార్తలు ఉన్నాయని, నెట్టింట వైరల్ అవుతున్నాయని తెలిపారు. దీంతో ఆ మీడియా ఛానెల్ యాంకర్ దీనికి ఎలాంటి ఆధారాలు అయినా ఉన్నాయా? అని అడిగారు. దీంతో పాక్ పరువు తానే తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫైటర్ జెట్ల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు కామెడీగా కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్రదాడుల్లో 28 మంది టూరిస్ట్‌లు మృతి చెందారు. కేవలం హిందువులనే టార్గెట్ చేసి హతం చేశారు. ఉగ్రవాదులు పక్కా ప్లానింగ్‌తో మతం ఏదని అడిగి మరి చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ పాక్‌పై వైమానిక దాడులు చేసింది. బుధవారం అర్థరాత్రి సమయంలో పాకిస్థాన్, పాక అక్రమిత కాశ్మీర్‌లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 90 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. భారత త్రివిధ దళాలు వైమానిక దాడులను చేపట్టిన కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేశాయి. ప్రతీకారంగా అర్థ రాత్రి సమయంలో దాడి చేసింది. పహల్గాంలో చనిపోయిన అమాయకుల ఆత్మకు శాంతి కలిగేలా భారత్ ఈ వైమానిక దాడికి పాల్పడింది. ఉగ్రవాదాలకు సంబంధించిన తొమ్మిది స్థావరాలను భారత్ నాశనం చేసింది. ముఖ్యంగా బహవల్పూర్‌ను టార్గెట్ చేసి మెరుపు దాడులు నిర్వహించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌కు చెందిన హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్‌కు చెందిన మదర్సాలే స్థావరాలను భారత్ ఆర్మీ నాశనం చేసింది. పహల్గాం దాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది.
Related News
-
Operation Sindoor: ఇట్స్ అఫిషియల్.. ఆపరేషన్ సిందూర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
-
Operation Sindoor: ఇప్పటి వరకు పాక్‌పై భారత్ చేపట్టిన మిలిటరీ ఆపరేషన్స్ ఇవే
-
Operation Sindoor: పాకిస్తాన్, పీఓకేలో కీలక ఉగ్రవాద స్థావరాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. జైషే చీఫ్ మసూద్ అజార్ ఎవరు?
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. ఐపీఎల్‌కి ఆటంకమా!
-
Operation Sindoor: పాక్‌లో మొదలైన యుద్ధ భయం.. ఆపరేషన్ సిందూర్ ఎఫెక్టేనా?