Jos Butler: ఇంగ్లాండ్ క్రికెటర్ బట్లర్ కెప్టెన్సీకి గుడ్ బై.. కారణమేంటి? తర్వాత కెప్టెన్ ఎవరు

Jos butler:
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. అయితే దీని తర్వాత ఇంగ్లాండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్సీ జోస్ బట్లర్ పదవికి రాజీనామా చేశాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు తానే స్వయంగా ప్రకటించాడు. ఇంగ్లాండ్ జట్టు వరుస మ్యాచ్‌లు ఓడిపోవడంతో బట్లర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో కూడా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌పై కూడా ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇలా వరుస పరాజయాలు కావడంతో కెప్టెన్సీ నుంచి బట్లర్ తప్పుకున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్‌కి బట్లర్ రాజీనామా చేశాడు. ఇంగ్లాండ్ జట్టు ప్రదర్శన ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇయాన్ మోర్గాన్ రిటైర్ అయితే బట్లర్ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు ఇతను తప్పకోవడంతో మళ్లీ ఎవరు కెప్టెన్ అవుతారని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న హ్యారీ బ్రూక్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరు ఇంగ్లాండ్ కెప్టెన్ అవుతారో చూడాలి.
ఇదిలా ఉండగా.. ఆఫ్గానిస్థాన్ చేతిలో 8 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పరాజయం పాలైంది. లాహోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 7 వికెట్‌లకు 325 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 146 బంతుల్లో 177 కొట్టాడు. ఈ మెగాటోర్నీలో అత్యధిక స్కోర్‌తో రికార్డులోకి ఎక్కాడు. అయితే ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. మాజీ కెప్టెన్ జో రూట్ సెంచరీ చేసినా కూడా ఫలితం లేకపోయింది. మొత్తం 111 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఇప్పటికే పాకిస్థాన్, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి ఔట్ కాగా.. ఇంగ్లాండ్ కూడా ఈ లిస్ట్‌లో చేరింది. దీంతో బట్లర్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19వ తేదీన ప్రారంభమైంది. ఇప్పటికే ఈ ట్రోఫీ నుంచి పాకిస్థాన్ ఔట్ కాగా ఇటీవల బంగ్లాదేశ్ కూడా ఔట్ అయ్యింది. ఈ ట్రోఫీలో పాకిస్థాన్ మొదటి మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి పాలైంది. ఆ తర్వాత భారత్‌తో పాక్ మ్యాచ్ ఆడగా ఇందులో కూడా ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ గెలిచి ఉంటే పాకిస్థాన్‌కు సెమీస్ ఆశలు ఉండేవి. కానీ బంగ్లాదేశ్ ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ నుంచి నిష్క్రమించింది. ఇలా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ మూడు కూడా ఈ ఛాంపియన్స్ టోర్నీ నుంచి తప్పుకున్నాయి.
-
Harry Brook: ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి హ్యారీ బ్రూక్ ఔట్.. ఇతని స్థానంలోకి వచ్చేదెవరు?
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్