Bald Head: చిన్న వయస్సులోనే వేధిస్తున్న బట్టతల.. దీనికి గల కారణం ఏంటి?

Bald Head:
ప్రస్తుతం ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య బట్టతల. వయస్సు, జెండర్‌తో సంబంధం లేకుండా చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే అమ్మాయిలు, అబ్బాయిలు కూడా బట్టతలతో ఇబ్బంది పడుతున్నారు. పూర్వం అయితే వయస్సు పెరిగిన తర్వాత అంటే 50 ఏళ్లు దాటిన తర్వాత బట్టతల వచ్చేది. కానీ ప్రస్తుతం చాలా మంది యంగ్ ఏజ్‌లోనే ఈ సమస్య బారిన పడుతున్నారు. మారిన జీవనశైలి, పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల కూడా బట్టతల వస్తుంది. ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో చాలా మంది పోషకాలు లేని ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే బట్టతల రావడానికి ఇదేనా కారణమా? ఇంకా ఏవైనా ఉన్నాయా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బట్టతల రావడానికి ముఖ్య కారణం మన జీవనశైలి. ప్రస్తుతం ఉన్న బిజీ ప్రపంచంలో పోషకాల ఆహారం వైపు ఎవరూ కూడా మొగ్గు చూపించడం లేదు. దీంతో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు. వీటివల్ల ఎక్కువగా బట్టతల వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు వాటర్ చాలా తక్కువగా తీసుకుంటారు. దీనివల్ల బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనివల్ల కూడా జుట్టు తొందరగా రాలిపోయి బట్టతల సమస్య వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే మరికొందరికి వంశంపారంపర్యంగా కూడా బట్టతల వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. మీ వంశంలో ఎవరికైనా బట్టతల ఉంటే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు పోషకాలు లేని ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బట్టతల వస్తుంది. అలాగే ఎక్కువగా ఒత్తిడికి గురైన కూడా బట్టతల వస్తుంది. అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే బాడీ డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం డైలీ ఒక గ్లాసు మజ్జిగ తాగాలని చెబుతున్నారు. మజ్జిగ తాగడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. దీంతో బట్టతల వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే డైలీ మొలకెత్తిన గింజలు, నట్స్, సీడ్స్ వంటి పోషకాలు ఉండే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇవి జుట్టు రాలే సమస్యను తగ్గించడంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది.
జుట్టు రాలిపోయే లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం లైట్ తీసుకోకుండా పోషకాలు ఉండే ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి. పోషకాహారం లోపం వల్ల తొందరగా జుట్టు రాలిపోతుంది. కాబట్టి ఐరన్, ఫోలిక్ ఆమ్లం, కాల్షియం, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మరికొందరికి చర్మ సమస్యల వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. దురద, సోరియాసిస్ వంటి వాటి వల్ల కూడా ఈ సమస్య కనిపిస్తుంది. కాబట్టి బాదం, వాల్ నట్స్, ఐరన్ ఎక్కువగా ఉండే పాలకూర వాటిని తీసుకోవాలి. వీటివల్ల జుట్టు రాలిపోయే సమస్య తగ్గడంతో పాటు తొందరగా, బలంగా పెరుగుతుంది.