Salt: వామ్మో ఉప్పు కు ముప్పై వేలా? ఇదేం ఉప్పురా నాయనా? ఆస్తులు అమ్ముకోవాల్సిందే.

Salt: వెదురు ఉప్పు, బాంబూ సాల్ట్, కొరియన్ ఉప్పు అని రకరకాల పేర్లతో ఓ రకం ఉప్పు పేరు తెగ వైరల్ అవుతుంది కదా. మీరు విన్నారా ఈ పేరు. వినే ఉంటారు. అయితే అమ్మో ఉప్పుకు ముప్పై వేలా? అవునండీ ఈ ఉప్పుకు ఏకంగా రూ. 30వేలకు పై మాటేనట. ఏంటి ఉప్పు ప్యాకెట్ కొంటే జస్ట్ రూ. 10 కి వస్తుంది. ఇప్పుడు కాస్త ధరలు పెరిగాయి కాబట్టి రూ. 30 అనుకుందాం. లేదంటే చివరికి వంద ఉంటుంది కానీ మా చెవిలో పూలు కనిపిస్తున్నాయా ఉప్పుకు రూ. 30 వేలు ఏంటి అని అనుకోవద్దు. కానీ ఇదే నిజం మరి ఈ ఉప్పు గురించి ఓ సారి తెలుసుకుందామా?
ఈ ఉప్పులో చాలా పోషకాలు ఉంటాయి. సాధారణ ఉప్పులో ఉండి సోడియం ఇందులో ఉండదట. ఇక ఇది ఉత్తరాఖండ్ లో తయారు అవుతుంది. దీన్ని వాణిజ్య మార్కెట్ లోకి ప్రవేశ పెట్టడానికి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు వ్యాపారవేత్తలు. అయితే ఈ ఉప్పును కొరియన్ ఉప్పు అని కూడా అంటారు. అయితే దీన్ని వెదురు సహాయంతో తయారు చేస్తారు. అందుకే వెదురు ఉప్పు అని కూడా పిలుస్తారు. ఇక ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇక ఈ ఉప్పును ముందు కొరియాలో తయారు చేసేవారు.
వెదురు బొంగులో సముద్రపు ఉప్పును నింపి 400 డిగ్రీల వద్ద కాలుస్తారు. ఇలా ఏకంగా 9 సార్లు చేస్తారట. అప్పుడు అది స్పటిక రూపంలోకి మారుతుంది. అంటే ఒక్క కేజీ తయారు చేయాలి అంటే ఏకంగా 20 రోజుల సమయం పడుతుంది అంటున్నారు వ్యాపారవేత్తలు. ఇక ఇందులో ఏకంగా 73 మినరల్స్ ఉంటాయట. దీన్ని వినియోగించడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఇక ఈ ఉప్పుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 లక్షల 40 వేల కోట్ల రూపాయల మార్కెట్ ఉందట. ఇక దీన్ని తయారు చేయాలంటే చాలా కష్టం. అందుకే ధర కూడా ఎక్కువే. ఇక ఇది పరిమిత పరిమాణంలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. సాధారణ ఉప్పు కంటే వెదురు ఉప్పు 10 రెట్లు తక్కువ ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇక భారతదేశంలో ఉప్పు ధర చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ ప్రక్రియ ద్వారా వెదురు ఉప్పును పెద్ద పరిమాణంలో తయారు చేయడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో లభించే ధర కంటే తక్కువ ధరకు కూడా అందుబాటులో ఉంచవచ్చు. ఈ ఉప్పు అంతర్జాతీయ మార్కెట్లో కిలోకు దాదాపు రూ.20,000 నుంచి 30,000 వరకు అమ్ముడవుతోంది. బాంబూసోల్ట్ సిద్ధం కావడానికి చాలా సమయం పడుతుంది. ఒక కిలో వెదురు ఉప్పు దాదాపు 20 రోజుల్లో తయారవుతుంది. సో ధర ఎక్కువగా ఉంటుంది. అయినా దీన్ని కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే కావచ్చు కదా.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.