Salt: ఉప్పు అధికంగా తింటున్నారా.. ఈ క్యాన్సర్ బారిన పడక తప్పదు
ప్రతీ వ్యక్తి రోజుకి కేవలం ఐదు గ్రాముల కంటే తక్కువ ఉప్పు మాత్రమే తీసుకోవాలి. ఇంతకంటే ఎక్కువగా తీసుకుంటే తప్పకుండా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Salt: ఏ వంటకానికి అయినా కూడా ఉప్పు లేకపోతే అసలు టేస్ట్ ఉండదు. వంటలు అన్ని రుచిగా ఉండాలంటే తప్పకుండా ఉప్పు అవసరం. అయితే ఉప్పు అనేది తక్కువగా తిన్నా, ఎక్కువగా తిన్నా కూడా ఆరోగ్యానికి ప్రమాదమే. తక్కువగా తింటే లో బీపీ, ఎక్కువగా తింటే హైబీపీ వస్తుంది. దీంతో కొందరు వైద్యులు ఉప్పును తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోమని చెబుతుంటారు. అయితే లిమిట్‌లో కాకుండా ఎక్కువ మొత్తంలో ఉప్పు తీసుకోవడం వల్ల పొట్ట క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఉప్పులో ఎక్కువగా అయోడిన్ ఉంటుంది. ఇది శరీరానికి కాస్త లిమిట్‌లోనే అవసరం. అంతకంటే ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదకరం. కొందరు చాలా ఎక్కువగా ఉప్పు, కారం వంటల్లో ఉంటేనే తింటారు. దీనివల్ల పొట్ట క్యాన్సర్ వస్తుంది. అధిక ఉప్పు వల్ల పొట్టలోని పొర అంతా కూడా పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో అక్కడ క్యాన్సర్ కణితులు ఎక్కువగా పెరుగుతాయి. అలాగే పొట్ట క్యాన్సర్‌ను పెంచే ఫైలోరి బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. దీనివల్ల కడుపులో కణాల పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కాకుండా ఉప్పును తక్కువగా మాత్రమే తీసుకోండి. కాస్త చప్పగా తిన్నా కూడా ఎలాంటి నష్టం లేదు.
ప్రతీ వ్యక్తి రోజుకి కేవలం ఐదు గ్రాముల కంటే తక్కువ ఉప్పు మాత్రమే తీసుకోవాలి. ఇంతకంటే ఎక్కువగా తీసుకుంటే తప్పకుండా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కుటుంబంలో పొట్ట క్యాన్సర్ ఎవరికైనా ఉంటే తప్పకుండా వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వంశపారంపర్యంగా కూడా వస్తుందని అంటున్నారు. కాబట్టి కుటుంబంలో ఎవరికైనా ఉన్నవారు తక్కువగా ఉప్పు తీసుకోవడం ఉత్తమం. అయితే ఉప్పును కాకుండా ఇవి ఉన్న పదార్థాలు కూడా తక్కువగానే తీసుకోండి. ప్రాసెస్ చేసిన ఫుడ్, పిజ్జా, బర్గర్లు, హాట్ డాగ్స్ వంటి వాటిని అసలు తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో ఎక్కువగా సోడియం ఉంటుంది. వీటివల్ల కూడా బాడీలోకి ఉప్పు ఎక్కువగా వెళ్తుంది. కాబట్టి తక్కువగా ఉప్పు తీసుకోవడం, ఉప్పు ఉన్న పదార్థాలు తక్కువగా తీసుకోవడం వంటివి చేయాలి. వీటి వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. దీనివల్ల కూడా బాడీకి అధిక మొత్తంలో సోడియం అందుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువగా బయట ఫుడ్, మసాలా వంటి ఫుడ్స్ అసలు తినవద్దు. వీటివల్ల ఉన్న ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బ తింటుంది.
ALso Read: Eye Health Tips: కన్ను కొట్టుకుంటుందా? దీని వెనుక కారణం ఏంటో తెలుసా?
-
Cancer: ఈ పదార్థాలు తీసుకుంటే.. క్యాన్సర్ నుంచి విముక్తి
-
Cancer: పాలియేటివ్ కేర్‌తో క్యాన్సర్ నుంచి ఉపశమనం
-
Salt : ఉప్పు తక్కువ అయితే ఫుడ్ తినరా? కాస్త ఎక్కువ అయినా డైరెక్ట్ అటేనట..
-
Salt: ఉప్పు ఎక్కువైతే కాదు.. తక్కువైనా ప్రమాదమే!
-
Cancer: సన్ స్క్రీన్ క్యాన్సర్ ను తెస్తుందా? క్యాన్సర్ రాకుండా కాపాడుతుందా?
-
Weight Loss: ఈ కాఫీతో ఈజీగా వెయిట్ లాస్