Salt: ఈ సమయంలో ఇంటికి ఉప్పు తీసుకొస్తున్నారా.. లక్ష్మీదేవి ఆగ్రహించడం పక్కా

Salt:
పురాతన కాలం నుంచి చాలా మంది వాస్తు నియమాలు పాటిస్తారు. ముఖ్యంగా ఇంటికి ఏయే రోజుల్లో ఏ వస్తువులు తీసుకురావాలి. ఏ వస్తువులు తీసుకురాకూడదనే విషయాలను కూడా బలంగా పాటిస్తారు. అయితే హిందువులు ఉప్పును లక్ష్మీదేవితో కొలుస్తారు. ఉప్పును ఇతరులకు అప్పుగా కూడా ఇవ్వరు. అలాగే ఇంటికి కూడా మంచి శుభ రోజుల్లో తీసుకురావడం, ఉప్పు పెట్టి వాటిలో దీపం ముట్టించడం వంటివి చేస్తుంటారు. ఉప్పు విషయంలో అయితే చాలా నియమాలు పాటిస్తారు. ఎందుకంటే ఉప్పును లక్ష్మీదేవితో కొలుస్తారు. దీనిని కొలవడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని భావిస్తారు. అయితే కొందరి తెలియక ఉప్పును కొన్ని రోజుల్లో ఇంటికి తీసుకొస్తుంటారు. అసలు ఉప్పును ఏ సమయంలో, ఏ రోజున ఇంటికి తీసుకురావాలి? ఏ సమయంలో తీసుకొస్తే అనుకూలమైన ఫలితాలు ఉంటాయో పూర్తి వివరాలు కూడా తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.
ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీక. అందుకే ఎవరిని అయినా ఉప్పు అడిగితే ఇవ్వరు. దీన్ని ఇస్తే ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుందని నమ్ముతారు. అందుకే ఉప్పును ఎక్కువగా కొలుస్తుంటారు. ఎప్పుడు కూడా ఉప్పును శుక్రవారం రోజునే ఇంటికి తీసుకురావాలని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఉప్పును ఈ రోజున తీసుకొస్తే ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఎలాంటి సమస్యలు లేకుండా అంతా కూడా సానుకూల వాతావరణ ఏర్పడుతుందని పండితులు అంటున్నారు. అయితే రోజులో ఉప్పును సాయంత్రం అసలు తీసుకురాకూడదు. అంటే సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పును ఇంటికి తీసుకురాకూడదు. ఈ సమయంలో ఇంటికి ఉప్పు తీసుకొస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి. అన్నింట్లో కూడా ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. సూర్యాస్తమయం తర్వాత ఉప్పు అప్పు తీసుకోవడం, లేదా షాప్ నుంచి తీసుకురావడం, ఇతరులకు అప్పు ఇవ్వడం తప్పకుండా సమస్యలు ఎదుర్కొంటారని పండితులు అంటున్నారు. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో కూడా ఈ మిస్టేక్స్ అసలు చేయవద్దు.
ఉప్పు అనేది లక్షీదేవి. దీన్ని మీరు సాయంత్రం సమయాల్లో ఎవరికైనా ఇస్తే.. మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి పూర్తిగా వెళ్లిపోతుంది. లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లు అవుతుంది. అలాగే ఇంటికి తీసుకొచ్చినా కూడా ఇంట్లో సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఉప్పును తప్పకుండా గౌరవించడంతో పాటు పూజించాలి. అప్పుడు మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. లేకపోతే ఏవో ఒక ఆర్థిక సమస్యలు వస్తూనే ఉంటాయి. కొందరు ఉప్పును పడేస్తుంటారు. అయితే ఉప్పును నేల మీద అసలు పడేయకూడదు. దీనివల్ల ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది. ఇలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి మీపై ఆగ్రహిస్తుంది. మీకు అన్ని ఆటంకాలను ఇస్తుంది. ఉప్పును శుక్రవారం కొని తేవడం వల్ల ఇంట్లో సమస్యలు తీరి, మానసికంగా సంతోషంగా ఉంటారు. అలాగే జేబులో పెట్టుకుని తిరగడం వల్ల ఇతరుల నుంచి దిష్టి తగలదు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. పొరపాటున చిన్న తప్పులు కానీ ఉప్పు విషయంలో చేశారో తప్పకుండా మీరు సమస్యల బారిన పడాల్సి వస్తుంది.