Salt: ఉప్పు ఎక్కువైతే కాదు.. తక్కువైనా ప్రమాదమే!
Salt ఉప్పులో సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఇది ఎక్కవైనా, తక్కువైనా ప్రమాదమే. లిమిట్‌లో తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Salt: వండిన వంటలు టేస్టీగా రావాలంటే మాత్రం తప్పకుండా ఉప్పు ఉండాలి. ఈ ఉప్పు కాస్త ఎక్కువైనా, తక్కువైనా కూడా ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు. వంటల్లో కొందరు ఉప్పు ఎక్కువగా తింటారు. మరికొందరు చాలా తక్కువగా తింటారు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయం మనలో చాలా మందికి తెలుసు. అలాగే ఉప్పు తక్కువైనా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొందరు చాలా తక్కువగా ఉప్పు తీసుకుంటారు. ఎలా అంటే ఫుడ్ టేస్ట్ కూడా ఉండదు. అలా తింటారు. అయితే ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఉప్పులో సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఇది ఎక్కవైనా, తక్కువైనా ప్రమాదమే. లిమిట్‌లో తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు తక్కువగా తీసుకుంటే అనారోగ్యం బారిన పడతారని నిపుణులు అంటున్నారు. ఉప్పు ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. అదే తక్కువ అయితే రక్తపోటు పూర్తిగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీ బాడీలో సోడియం తగ్గిపోతుందో బాడీలో కొన్ని మార్పులు వస్తాయి. ముఖ్యంగా శరీరంలోని నీటి స్థాయిలు బాగా పెరిగిపోతాయి. దీంతో బాడీ ఉబ్బినట్లు కనిపిస్తుంది. మెదడులోని కణాలు అన్ని కూడా వాచిపోతాయి. దీనివల్ల నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. దీని పనితీరు ఆగిపోతుంది. దీంతో మీరు ఒక్కసారిగా అనారోగ్యం బారిన పడతారు. ఇలా బాడీ ఉబ్బినట్లు లక్షణాలు కనిపిస్తే అది హైపోనాట్రేమియాకి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో బాగా ఉప్పు తక్కువైతేనే ఈ హైపోనాట్రేమియా వ్యాధి వస్తుంది. ఇది వస్తే వికారం, వాంతులు వచ్చినట్లు అనిపిస్తాయి. అలాగే తలనొప్పిగా అనిపించడంతో పాటు కాస్త ఆందోళన, చిరాకు, ఒత్తిడి ఉంటుంది. పోషకాలు ఉండే ఫుడ్ తీసుకున్నా కూడా నీరసం, అలసటగా అనిపిస్తుంది. దీంతో త్వరంగా కోపం, చిరాకు అన్ని కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా బాగా ఉప్పు తక్కువైతే కొన్నిసార్లు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోమాలోకి వెళ్తే మాత్రం కొన్నిసార్లు మరణం తప్పదు. కాబట్టి మరీ తక్కువగా ఉప్పు తీసుకోవద్దు.
ఉప్పు తక్కువగా తీసుకుంటే ఇదే కాకుండా డయాబెటిస్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. సోడియం తగ్గితే నరాలు బలహీనంగా మారుతాయి. దీంతో కండరాల పనితీరు బాగా తగ్గిపోతుంది. దీనివల్ల బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. శరీరానికి సరిపడా సోడియం స్థాయిలు ఉండాలి. ఇవి మాత్రం తగ్గితే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి మరీ తక్కువగా ఉప్పు అయితే తీసుకోవద్దు. ఉప్పు సరిపడా మాత్రమే తీసుకోండి. ఎక్కువైనా కూడా రక్తపోటు పెరిగి గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీని చివరకు మరణానికి దారితీస్తుంది. డిప్రెషన్‌లోకి వెళ్లేలా చేస్తుంది. కాబట్టి ఉప్పు లిమిట్‌లో తీసుకోండి. మీకు ఒకవేళ హైపోనాట్రేమియా వ్యాధి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.