Breakfast: బ్రేక్ ఫాస్ట్ టైంలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?

Breakfast:రోజు మొత్తంలో బ్రేక్ ఫాస్ట్ అనేది చాలా ముఖ్యం. ఉదయం పూట తినకపోతే మాత్రం రోజంతా నీరసం, అలసట వంటి సమస్యలు అన్ని కూడా వస్తాయి. రోజులో ఏ పూట అయినా కూడా తినడం మానేసిన పెద్దగా ప్రభావం చూపదు. కానీ ఉదయం పూట మాత్రం తినకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట తీసుకునే ఫుడ్ బట్టి రోజంతా కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఉదయం పూట తప్పకుండా పోషకాలు ఉండే ఆరోగ్యమైన ఫుడ్‌ను తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. అయితే కొందరికి తెలియక ఉదయం పూట టిఫిన్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. అయితే బ్రేక్ ఫాస్ట్ సమయంలో చేకూడని ఆ తప్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఉదయం ఆలస్యంగా కాకుండా సరైన సమయానికి బ్రేక్ ఫాస్ట్ చేయాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. లేకపోతే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం తొందరగా బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియ కూడా సాఫీగా సాగుతుంది. చాలా మంది 10 గంటల తర్వాత టిఫిన్ చేస్తారు. అయితే ఉదయం లేచిన రెండు లేదా మూడు గంటల్లోగా అల్పాహారం తీసుకోవాలి. అప్పుడే తీసుకున్న ఫుడ్ బాడీకి అందుతుందని నిపుణులు అంటున్నారు. తినే ఫుడ్‌లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండేలా కాకుండా.. ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. వీటివల్ల కండరాలు బలంగా ఉంటాయి. అలాగే తిన్న ఫుడ్ కూడా ఈజీగా జీర్ణం అవుతుంది. ఉదయం టిఫిన్‌లో గుడ్లు, పనీర్ వంటివి ఉండేలా చూసుకోండి. వీటివల్ల బాడీకి కూడా తక్షణమే శక్తి లభిస్తుంది.
ఉదయం పూట ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోండి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ఫైబర్ వల్ల పొట్ట కూడా నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో మీకు ఆకలి వేయకుండా ఏం తినకుండా ఉంటారు. దీనివల్ల మీరు బరువు తగ్గుతారు. ఉదయం పూట ఓట్స్, పీనట్ బటర్ వంటివి తీసుకోవాలి. వీటిలో ఫైబర్, ప్రొటీన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. చాలా మంది ఉదయం పూట తీపి పదార్థాలు, పేస్ట్రీ, కేక్, ఆయిల్ ఫుడ్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటారు. వీటివల్ల రక్తంలో చక్కె్ర స్థాయిలు పెరుగుతాయి. వీటివల్ల ఊబకాయం కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఉదయం పూట ఆరోగ్యానికి మేలు చేసే వాటిని తీసుకోవడం మంచిది. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఉదయం పూట మసాలా, చీజ్, బ్రెడ్ వంటి వాటిని ఎక్కువగా తింటున్నారు. ఉదయం పూట వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Money: ఈ చెట్టు ఆకుతో మీరు ఇలా చేస్తే.. డబ్బే డబ్బు
-
Early Morning: ఉదయం ఈ తప్పులు చేస్తే.. సంపద గోవిందా
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు ఈ చిన్న పని చేస్తే.. డబ్బే డబ్బు
-
AC: ఏసీలో ఎక్కువ సమయం ఉంటే.. బరువు పెరుగుతారా?
-
Chicken: చికెన్ అతిగా తినేవారికి పొంచి ఉన్న ప్రమాదం
-
Laptop : లాప్ టాప్ ముందు కూర్చొని కూర్చొని భుజం నొప్పి వస్తుందా?