Curd: తాజా అధ్యయనం: పెరుగు వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ కు చెక్. ఎలాగంటే?

Curd: పెరుగును చాలా మంది ఇష్టంగా తింటారు. ఎంత ఇష్టమైన కర్రీ తిన్నా సరే చివరకు మాత్రం పెరుగు ఉండాల్సిందే. ఒక ముద్ద అయినా సరే పెరుగు తింటే ఆ ఆనందమే వేరు కదా పెరుగు లవర్స్. యస్ అంటారు మీరు అందరూ. అది సరే కానీ మీకు ఒక గుడ్ న్యూస్ అండీ బాబూ.. పెరుగు తినే అలవాటు ఉన్న వారికి అసలు క్యాన్సరే రాదట. అవునా అని ఆశ్చర్యపోయారా? కాని ఇది నిజమే. మరి పెరుగు ఏ క్యాన్సర్ ను తరిమి కొడుతుంది? ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే వివరాలు చూసేద్దామా?
పెద్దప్రేగు క్యాన్సర్ తో చాలా మంది బాధ పడుతున్నారు. కానీ ఇప్పుడు దీనికి మంచి పరిష్కారం పెరుగు. ప్రతిరోజూ పెరుగు తినడం వల్ల దీనికి చెక్ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఇటీవలి పరిశోధనలో, పెరుగు తినడం వల్ల పేగు క్యాన్సర్ అంటే పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని తేలింది. ఈ అధ్యయనాన్ని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ టోమోటాకో ఉగై, PhD నిర్వహించారు. అయితే ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందామా.
పెద్దప్రేగు క్యాన్సర్ అంటే? పెద్దప్రేగు క్యాన్సర్ అనేది ఒక రకమైన ప్రేగు క్యాన్సర్ గా చెబుతున్నారు వైద్యులు. అయితే ఇది ప్రాక్సిమల్ పెద్దప్రేగులో వస్తుంది. ప్రారంభం దశలో లక్షణాలను గుర్తించడం కష్టం. సరైన సమయానికి గుర్తించకపోతే ప్రాణాంతకం కూడా ఈ క్యాన్సర్. కానీ సమయంలో దీనికి సంబంధించిన చికిత్సను అందిస్తే మాత్రం ఎలాంటి ప్రమాదం ఉండదు అంటున్నారు నిపుణులు.
ఇంతకీ పెరుగు కాపాడుతుందా?: పెరుగులో ఉండే బ్యాక్టీరియా పేగు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ బ్యాక్టీరియా పేగు లోపల మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. చెడు బ్యాక్టీరియాను అదుపులో ఉంచుతుంది. దీని వల్ల ప్రేగు ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా పెద్ద ప్రేగు క్యాన్సర్ ను రాకుండా కాపాడవచ్చు అని తేల్చింది అధ్యయనం.
ఈ అధ్యయనాన్ని ఏకంగా 1,32,000 మంది మీద నిర్వహించారు వైద్యులు. వీరందరి మీద పరిశోధన చేసిన తర్వాత ఈ అధ్యయనం రిజల్ట్ ను తెలిపారు పరిశోధకులు. అయితే పెరుగు తింటే పేరు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుందట. పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుందట. ఇక పరిశోధనలో పెరుగు వినియోగం క్యాన్సర్ నిరోధకంగా తేల్చారు నిపుణులు. ఎందుకంటే ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుందని తేలింది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Weight lose: ఈజీగా బరువు తగ్గాలంటే రాత్రిపూట ఇవి తినాల్సిందే
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్క్రీమ్స్ ఇస్తున్నారా?
-
Drink Milk: ఈ సమస్యలున్న వారు మిల్క్ తాగితే అంతే సంగతులు
-
Health Tips: రోజంతా ఏం తినకపోయినా సరే ఆకలి అనిపించడం లేదా?
-
Ice cream : ఐస్ క్రీమ్ లో రెండు రకాలు.. ఆ రెండోది తింటే మీకు గుండె ఫెయిల్ ఖాయం
-
Health Tips: ఈ ఫ్రూట్ జూస్ లను మాత్రం అసలు కలిపి తీసుకోవద్దు..