Late Marriage: ఆలస్యంగా పెళ్లి అవుతుందని చింతించకు బ్రో.. ఈ మ్యారేజ్ కూడా ఆరోగ్యానికి మంచిదేనట!
ఈ రోజుల్లో తొందరగా పెళ్లి చేసుకోవడం కంటే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. వ్యక్తిగత కారణాలు, జనరేషన్, కెరీర్ పరంగా ఆలోచించి చాలా మంది లేట్ మ్యారేజ్‌కి మక్కువ చూపిస్తున్నారు.

Late Marriage: ఈ రోజుల్లో తొందరగా పెళ్లి చేసుకోవడం కంటే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. వ్యక్తిగత కారణాలు, జనరేషన్, కెరీర్ పరంగా ఆలోచించి చాలా మంది లేట్ మ్యారేజ్‌కి మక్కువ చూపిస్తున్నారు. అయితే ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల సమస్యలు వస్తాయని కొందరు అంటుంటారు. నిజం చెప్పాలంటే ఒక వయస్సు వచ్చాక పెళ్లి చేసుకోకపోతే ఆ టార్చర్ కూడా మాములుగా ఉండదు. పెళ్లి ఎప్పుడు అని ప్రతీ ఒక్కరూ కూడా అడుగుతుంటారు. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కొందరు ఈ బాధలను తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో అయితే వివాహం కావడం లేదని కొందరు యువతులు, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read also: వధువుకు బదులు ఆమె తల్లి..బిత్తర పోయిన పెళ్ళికొడుకు
ఆర్థికంగా మెరుగు పడటం
ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉంటారు. తొందరగా పెళ్లి చేసుకుంటే.. డబ్బు ఎక్కువగా సంపాదించలేరు. అదే ఆలస్యంగా వివాహం చేసుకుంటే మాత్రం డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చు.
మంచి నిర్ణయాలు
ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరు. ఎందుకంటే మీకు కాస్త మెచ్యూరిటీ వస్తుంది. దీనివల్ల జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలరు. ఎలాంటి కష్ట సమయాల్లో అయినా కూడా ఫేస్ చేయగలరు. భవిష్యత్తు గురించి సరిగ్గా ప్రణాళిక వేసుకుంటారు. దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువగా సమస్యలు రావు.
వ్యక్తిగత వృద్ధి
ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల వ్యక్తిగతంగా మీరు వృద్ధి చెందుతారు. అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. దీంతో భాగస్వామిని, ఇతరులను ఈజీగా అర్థం చేసుకోగలరు. అలాగే ఎలాంటి ఇబ్బందులు కూడా రావు. జీవితాంతం కలిసి ఉండాలంటే భాగస్వాముల మధ్య అర్థం చేసుకునే గుణం ఉండాలి. అదే చిన్న వయస్సులో అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ రాదు.. కాస్త వయస్సు పెరిగితే ఆటోమెటిక్‌గా అర్థం చేసుకగలరు.
కలలను నెరవేర్చుకోవడం
ప్రతీ ఒక్కరికి కూడా జీవితంలో కొన్ని కలలు ఉంటాయి. వాటిని సాధించడానికి కూడా లేట్ మ్యారేజ్ వల్ల కుదురుతుంది. తొందరగా వివాహం జరిగితే.. పిల్లలు, బాధ్యతలు ఇలా అన్ని కూడా మన కలలను నేరవేర్చుకోవడానికి కుదరదు. అదే
ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే, తన కలలను నెరవేర్చుకోవడానికి, జీవితంలో మంచి లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. దీంతో మీరు కెరీర్‌ను మిస్ చేసుకున్నారనే బాధ కూడా ఉండదు.
Read Also: తల్లి బిడ్డకు ఇచ్చే ఒక్క కౌగిలింతతో ఇన్ని ప్రయోజనాలా?
మంచి భాగస్వామి
ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే చాలా విషయాల్లో ఆలోచించే విధానం మారుతుంది. చిన్నతనంలో పెద్దగా ఆలోచనలు రావు. అదే పెద్ద అయిన తర్వాత ఏది మంచి, ఏది చెడు అనే విషయంపై క్లారిటీ వస్తుంది. దీంతో భాగస్వామి విషయంలో కూడా కాస్త క్లారిటీగా ఉంటారు. ఎలాంటి గొడవలు రాకుండా ఇద్దరి మధ్య బంధం కూడా బలపడుతుందని నిపుణులు అంటున్నారు.
-
Zodiac Signs: అక్షయ తృతీయ నుంచి ఈ రాశుల వారికి పట్టింది బంగారమే
-
Lizards: ఈ చిట్కాలు పాటిస్తే.. ఇంట్లో బల్లులు పరార్
-
Pressure Cooker: ప్రెషర్ కుక్కర్లో ఇవి కుక్ చేస్తున్నారా.. మీరు పైకి పోవడం ఖాయం
-
Electric Car: 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అదిరిపోయింది.. చూస్తే కొనకుండా ఉండలేరు
-
Zodiac Signs: ప్రేమ విషయంలో ఈ రాశుల వారంతా అదృష్టవంతులు ఎవరూ లేరు భయ్యా
-
Rahu and Ketu: రాహు కేతువుల మార్పు.. వీరికి ఇక తిరుగే లేదు