Fever: జ్వరం వస్తే వీటిని తీసుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త

Fever:
వర్షాలు, నీరసం వంటి కారణాల వల్ల అప్పుడప్పుడు జ్వరం వస్తుంది. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సమయంలో జ్వరం అనేది రావడం కామన్. అయితే ఈ జ్వరం వచ్చినప్పుడు కొందరికి ఏం తినాలనిపించదు. మరికొందరికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఎక్కువ శాతం మంది జ్వరం వస్తే రైస్ తీసుకోకుండా చపాతీ, బ్రెడ్ వంటి టిఫిన్స్ ఎక్కువగా తీసుకుంటారు. మరికొందరు పాలు, టీ వంటి వాటిని తీసుకుంటారు. అయితే జ్వరం సమయంలో కొన్ని రకాల పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వాటిని తీసుకుంటే జ్వరం సంగతి పక్కన పెడితే మిగతా సమస్యలు ఎక్కువ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే జ్వరం వస్తే తీసుకోకూడదని ఆ పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
పాలు
జ్వరం వస్తే చాలా మంది పాలు తాగుతుంటారు. కానీ ఈ సమయంలో పాలు తాగితే జీర్ణం కాదు. పాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీంతో జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమయంలో అసలు పాలు తాగవద్దు.
తీపి పదార్థాలు
బేకరీ ఫుడ్స్, తీపి వస్తువులను ఈ సమయంలో తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకుంటే రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది.
మాంసం
జ్వరం సమయంలో మాంసం తింటే జీర్ణ క్రియ దెబ్బ తింటుంది. అలాగే జ్వరం కూడా తొందరగా తగ్గదు. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కూడా ఈ జ్వరం సమయాల్లో తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఫైబర్
ఇది ఆరోగ్యానికి మంచిదే. కానీ జ్వరం సమయంలో తీసుకోవడం అంత మంచిది కాదు. అధిక ఫైబర్ జ్వరం సమయంలో జీర్ణ సమస్యలు వచ్చేలా చేస్తుంది.
సిట్రస్ పండ్లు
జ్వరం సమయంలో జలుబు ఉంటుంది. ఈ సమయంలో సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల గొంతు, కడుపు సమస్యలు వస్తాయి.
కెఫిన్
కెఫిన్ అధికంగా ఉండే కాఫీ, టీ వంటి వాటిని కూడా ఈ సమయంలో తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల మీరు బలహీనం అవుతారు. అలాగే శ్వాసకోశ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కెఫిన్ వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. నిజానికి జ్వరం సమయాల్లో కొందరికి సరిగ్గా నిద్రపట్టదు. దీనికి తోడు వీటిని తీసుకుంటే పూర్తిగా నిద్రకు భంగం కలుగుతుంది.
ఫ్రైడ్ ఫుడ్స్
బాగా నూనెలో వేయించిన పదార్థాలను కూడా ఎక్కువగా తీసుకోకూడదు. వీటివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల శరీరానికి ఎలాంటి శక్తి కూడా లభించదు. చాలా నీరసంగా అనిపిస్తుంది. జ్వరం సమయాల్లో స్పైసీగా తినాలని ఉందని ఇలాంటి పదార్థాలు అసలు తీసుకోవద్దు.