Bread : బ్రెడ్ తింటే మలబద్ధకం నుంచి క్యాన్సర్ వరకు ఇన్ని సమస్యలు వస్తాయా.. నిపుణుల సూచన ఇదే !

Bread : ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల బ్రెడ్‌లు వస్తున్నాయి. రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తింటున్నారా?.. సాధారణంగా బ్రెడ్‌ను మైదా పిండితో తయారు చేస్తారు. ముఖ్యంగా తెల్ల బ్రెడ్‌లో పీచు పదార్థం (ఫైబర్) చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, బ్రెడ్ పాతబడినా కొన్ని రకాల సమస్యలు వస్తాయి. అయితే, బ్రెడ్ తినడం వల్ల మలబద్ధకం వస్తుందా? ఇది ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరం? ఈ విషయాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.
బ్రెడ్ తినడం సురక్షితమేనా?
సాధారణంగా బ్రెడ్ తినడం సురక్షితమే అని చాలామంది అనుకుంటారు. బ్రెడ్ సులభంగా జీర్ణమవుతుందని, దాని వల్ల కడుపు సంబంధిత సమస్యలు తక్కువగా వస్తాయని చెబుతారు. తరచుగా జ్వరం వచ్చినప్పుడు లేదా ఆరోగ్యం బాలేనప్పుడు ప్రజలు రోటీకి బదులుగా బ్రెడ్ తినడం మొదలుపెడతారు. కానీ, వైద్య నిపుణులు ఈ వాదనలను సరైనవి కాదని అంటున్నారు.
Read Also:Piyush Chawla: రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ క్రికెటర్.. కారణమిదే!
బ్రెడ్ మలబద్ధకానికి కారణం కావచ్చు
డాక్టర్లు తెలిపిన ప్రకారం.. బ్రెడ్‌లో ఫైబర్ దాదాపు ఉండదు. దీని వల్ల జీర్ణవ్యవస్థ (Digestive System)పై ప్రభావం పడుతుంది. ఫైబర్ ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది, మలవిసర్జనను సులభతరం చేస్తుంది. ఫైబర్ లోపం వల్ల మలవిసర్జన కష్టం కావచ్చు. మీరు రోజూ బ్రెడ్ తింటే, శరీరానికి సరిపడా ఫైబర్ అందక, ఆహారం జీర్ణం కావడంలో సమస్యలు వచ్చి, మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. నిత్యం బ్రెడ్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలహీనపడుతుంది. అంతేకాకుండా, బ్రెడ్ వల్ల కడుపు ఉబ్బరం (Bloating), గ్యాస్ (Gas), ఎసిడిటీ (Acidity) వంటి సమస్యలు కూడా వస్తాయి.
బ్రెడ్ క్యాన్సర్‌కు కారణమవుతుందా?
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. బ్రెడ్ వినియోగం, క్యాన్సర్‌పై అనేక పరిశోధనలు జరిగాయి. అయితే, బ్రెడ్‌కు కడుపు లేదా ఇతర రకాల క్యాన్సర్‌లతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు కనుగొనబడలేదు. బ్రెడ్ తినేవారికి ఏదైనా ప్రత్యేకమైన క్యాన్సర్ వచ్చిందని చెప్పడానికి ఆధారాలు లేవు. అయితే, బ్రెడ్ మలబద్ధకానికి కారణం కావచ్చు అనేది మాత్రం నిజం.
Read Also:Akhil Marriage: అఖిల్ పెళ్లి.. బరాత్‌లో రచ్చ రంబోలా చేసిన తండ్రీ కొడుకులు.. వీడియో వైరల్
బ్రౌన్ బ్రెడ్ తినవచ్చా?
బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తినే అలవాటు ఉంటే బ్రెడ్ ఏది తీసుకుంటున్నారో దాంట్లో జాగ్రత్తగా ఉండాలి. తెల్ల బ్రెడ్‌కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ (Brown Bread) తినవచ్చు. బ్రౌన్ బ్రెడ్ సాధారణంగా గోధుమ పిండితో తయారు చేస్తారు. ఇందులో తగినంత ఫైబర్ ఉంటుంది. బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల శరీరానికి సరిపడా ఫైబర్ అంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. కాబట్టి, బ్రెడ్ తినాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్‌ను ఎంచుకోవడం మంచిది.
-
Blood Sugar : బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే ఈ పండ్లను తినొద్దు
-
Weight Loss : రాకెట్ కంటే వేగంగా మీ బరువు తగ్గిస్తుంది.. ఈ సూపర్ ఫుడ్ ట్రై చేయండి
-
Biryani With Drink: బిర్యానీ విత్ డ్రింక్ తాగుతున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీకోసమే!
-
Cancer : మాటిమాటికీ గ్యాస్, మలబద్ధకం క్యాన్సర్‌కు కారణమట.. జాగ్రత్త పడకపోతే కష్టమే!
-
Weight Loss: వ్యాయామం చేయకుండా బరువు తగ్గడం ఎలా?
-
Curd Rice: పెరుగన్నంలో ఈ పండు కలిపి తింటే?