Health Issues: ఎక్కువగా చెమటలు వస్తున్నాయా.. మీకు ఈ సమస్యలు ఉన్నట్లే

Health Issues: వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్లో ఉక్కపోతకు ఎక్కువగా చెమట పడుతుంది. కొందరికి బాడీలో మాత్రమే చెమటలు పడితే మరికొందిరికి మాత్రం తల మొత్తం కూడా చెమట పట్టేస్తుంది. సాధారణంగా చెమట పడితే ఏం కాదు. కానీ కారణం లేకుండా ఎక్కువగా చెమట పడితే మాత్రం మీ శరీరంలో ఏవైనా లోపాలు ఉన్నట్లే అని నిపుణులు చెబుతున్నారు. కొందరికి ఉన్న అనారోగ్య సమస్యల వల్లన తలకు కూడా చెమట పడుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఉక్కపోతకు చెమట పడుతుంది. కానీ కారణం లేకుండా చెమట పడుతుంటే కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
విటమిన్ డి డెఫిషియన్సీ
తలకు ఎక్కువగా చెమట పడుతుంటే మాత్రం విటమిన్ డి లోపం ఉన్నట్లే. పోషకాలు ఉండే వాటిని తీసుకోకపోవడం లేదా సూర్యరశ్మిలో ఎక్కువగా లేకపోవడం వల్ల ఈ విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఈ లోపం వల్ల ఎక్కువగా చెమట పడుతుంది. సాధారణ చెమట కంటే తల నుంచి కూడా ఎక్కువగా చెమట వస్తుంది. వీటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని, వైద్యుల సూచనలు తీసుకుని మందులు వాడితే సరిపోతుంది. ఎలాంటి సమస్య ఉండదు. అయితే ఎక్కువగా లైట్ తీసుకోకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
రసాయనాలు ఉండే షాంపులు
వేసవిలో చల్లదనం కోసం చాలా మంది ఎక్కువసార్లు తలస్నానం చేస్తారు. దీనివల్ల తల నుంచి ఎక్కువగా చెమట వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని రసాయనాల వల్ల జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంది. వీటికి బదులు ఆర్గానిక్ షాంపులను వాడటం మంచిదని నిపుణులు అంటున్నారు. వీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇవి మంచిగా రక్తప్రసరణ జరిగేలా చేస్తాయి. అలాగే చెమట ఎక్కువగా రాకుండా చేస్తాయి. అయితే వారంలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే తలకు స్నానం చేయాలి. అంతకంటే ఎక్కువగా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆపిల్ వెనిగర్
వేసవిలో చెమట శరీరం నుంచి ఎక్కువగా రాకుండా ఉండాలంటే ఆపిల్ వెనిగర్‌తో తలస్నానం చేయాలి. దీనివల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్‌లో కాస్త వేడి నీరు వేసి తలకు మసాజ్ కూడా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల జట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుందట. వేసవిలో జుట్టుకు చెమట ఎక్కి తొందరగా రాలుతుంది. దీనివల్ల జుట్టు రాలిపోతుంది. అదే ఈ చిట్కా పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు అంటున్నారు.
నిమ్మ రసం
దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు చెమట పట్టకుండా చేస్తుంది. వేసవిలో జుట్టుకు నిమ్మరసం అప్లై చేయడం వల్ల బలంగా ఉంటుంది. జుట్టు రాలిపోవడం తగ్గడంతో పాటు చెమట కూడా రాదు. నిమ్మరసంలోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
-
Biryani With Drink: బిర్యానీ విత్ డ్రింక్ తాగుతున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీకోసమే!
-
Breakfast: ప్రతీ రోజూ టిఫిన్ స్కిప్ చేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Pani puri: ఇష్టమని పానీ పూరీ లాగించేస్తున్నారా.. ఈ సీజన్లో తింటే ప్రాణాలు గోవిందా!
-
Covid vaccine: కరోనా వ్యాక్సిన్‌తో గుండె పోటు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
-
Drinking Water: దాహం వేయడం లేదని వాటర్ తగ్గిస్తే.. ఆయుష్షు తగ్గిపోవడం పక్కా!
-
Health Issues: ఆరోగ్యానికి మంచిదని ఈ సీజనల్ ఫ్రూట్స్ తిన్న తర్వాత ఇలా చేశారో.. అంతే సంగతులు